e-PAN Card Scam: ఈ- పాన్ కార్డ్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త ఎర.. క్లిక్ చేస్తే ఇక అంతే

e-PAN Card Scam: ఈ- పాన్ కార్డ్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త ఎర.. క్లిక్ చేస్తే ఇక అంతే
x
Highlights

e-PAN Card Scam: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. కొత్త తరహా జిత్తులతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఈ-పాన్...

e-PAN Card Scam: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. కొత్త తరహా జిత్తులతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఈ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ పేరిట కొత్తగా మోసాలకు పాల్పడుతున్నారు. పాన్ కార్డును సులువుగా డౌన్ లోడ్ చేసుకోడంటూ ఈ-మెయిల్స్ పంపిస్తున్నారు. పొరపాటున ఆ లింకులు క్లిక్ చేస్తే మీ ఖాతా ఖాళీ కావడం ఖాయమంటోంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం.

పాన్ 2.0 గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు ఈ కొత్త మోసానికి తెరతీయడం గమనార్హం. ఈ పాన్ కార్డుని డౌన్‌లోడ్ చేసుకోవడంలో మీకు సహాయం చేయలా..? క్లైమ్ చేస్తూ మీకు సహాయం చేస్తాం అంటూ ఈ మెయిల్‌కి వచ్చే మెసేజ్‌లకు స్పందించొద్దంటోంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అయితే అసలు ఈ పాన్ కార్డ్ స్కామ్ ఎలా జరుగుతుంది..? ఎలా మొదలవుతుంది..? నకిలీ ఈ మెయిల్స్ ను ఎలా గుర్తించాలి..? అనే విషయాలను తెలుసుకుందాం.

నిజానికి ఈ స్కామ్స్ ఎంతో పకడ్బందీగా జరుగుతున్నాయి. ఈ పాన్ కార్డుని డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ వచ్చిన ఈ మెయిల్ తో స్కామ్ మొదలవుతుంది. కొత్తగా వచ్చిన పాన్ 2.0 ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. మీ పాన్ కార్డ్ డేటా జాగ్రత్తగా ఉంచుతామంటూ, ఇందుకు తగిన డేటా మీరే రక్షించుకోవాలని క్యూఆర్ కోడ్‌తో యూనిఫైడ్ పోర్టల్ లో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలంటూ చెబుతూ సైబర్ క్రిమినల్స్ కొత్తరకం మోసాలకు తెరతీస్తున్నారు.

ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి మెసేజ్ చేస్తున్నామంటూ తప్పుడు ఈ మెయిల్స్ పంపిస్తారని.. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పీబీఐ తెలిపింది. ఈ పాప్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడంలో మీకు సహాయం చేస్తామంటూ వచ్చే మెయిల్స్ మొత్తం ఫేక్ అంటూ స్పష్టం చేసింది.

ఇప్పటికే ఇలాంటి ఈ మెయిల్ మీకు వచ్చి ఉంటే వాటిని క్లిక్ చేయొద్దని తెలిపింది. అఫీషియల్ వెబ్ సైట్లోకి వెళ్లి మాత్రమే ఈ పాన్ కార్డును అప్డేట్ చేసుకోవాలని సూచించింది. మెయిల్స్ కు వచ్చిన లింక్స్ నమ్మి వాటిని ఓపెన్ చేయొద్దని చెప్పింది. ఈ మెయిల్స్, కాల్స్, ఎస్‌ఎంఎస్ ఇలా ఏ విషయానికి స్పందించవద్దని.. ఆర్థిక, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవద్దని హెచ్చరించింది. ఒకవేళ అలాంటి ఈ మెయిల్స్ వస్తే ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని అఫీషియల్ వెబ్ సైట్లోకి వెళ్లి గుర్తించాలని తెలిపింది. ఆర్థిక విషయాలు, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సిన సందర్భాల్లో అధికారిక వెబ్ సైట్లను ఆశ్రయించాలని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories