Dussehra Celebration: దేశవ్యాప్తంగా వైభవంగా దసరా సంబరాలు

Dussehra Celebration Across the India
x

దేశవ్యాప్తంగా దసరా సంబరాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Dussehra Celebration: రాజరాజేశ్వరి దేవిగా దర్శనం ఇస్తున్న అమ్మవారు

Dussehra Celebration: చెడు పై మంచి విజయం సాధించినందుకు జరుపుకునే పండుగ విజయదశిమి. ఈ రోజున ఏది ప్రారంభించినా విజయం తథ్యం అని అనాదిగా భక్తులు విశ్వసిస్తున్నారు. దసరా దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇవాళ అమ్మవారు రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనం ఇస్తారు పరమ శాంతి స్వరూపంతో, చిరునవ్వులు చిందిస్తూ, చెరుగడ చేతితో పట్టుకుని దేవి దర్శనం ఇస్తారు. అమ్మలగన్న అమ్మ- ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆదిశక్తి అయిన దుర్గామాత మహిషాసురుణ్ణి వధించి, ముల్లోకాలనూ రక్షించినందుకు కృతజ్ఞతగా తొమ్మిది రోజుల పాటు ఆమెను కొలిచే సంప్రదాయాన్ని ఆసేతు హిమచలం పాటిస్తుంది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ దేవీ నవరాత్రులను జరిపి, పదవరోజైన దశమిని విజయదశిమిగా, దసరాగా భక్తులు జరుపుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగిన బ్రహ్మోత్సవాలు ఇవాళ్టీ ముగుస్తాయి కృష్ణా నదిలో గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వరులు త్రిలోక సంచారం చేసేందుకు జలవిహారం ఉంటుంది. అయితే నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో విహారం రద్దు చేశారు. తీరంలోనే ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.

దసరా నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్‌లో వైభవంగా జరుగుతున్నాయి. విజయదశిమి రోజున జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాయంలో ఉదయం నుంచే భక్తుల కోలహలం కనిపిస్తోంది. సాధారణ భక్తులతో పాటు వీఐపీలు, ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories