Oxygen Supply Crisis: ఆక్సిజన్ అందక 24 మంది కోవిడ్ పేషెంట్ల మరణం

Due to Lack of Oxygen 24 People died in Karnataka Government Hospital
x

Chamarajanagar Govt Hospital in Karnataka:(File Image)

Highlights

Oxygen Supply Crisis: మైసూర్ జిల్లాలోని చామరాజనగర్‌లో 24 మంది కరోనా పేషెంట్లు... ఆక్సిజన్ లేక చనిపోయారు.

Oxygen Supply Crisis: ఒక గంట ఆలస్యం చేస్తే చాలు... ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. అవును ఆక్సిజన్ సప్లయ్ చేయడంలో నిముషం నిర్లక్ష్యం చేసినా.. పోయిన ప్రాణాలు లెక్కేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఆక్సిజన్ కోసం ఏదో చేసేస్తున్నట్లు ఒకవైపు ప్రభుత్వాలు హంగామా చేస్తూనే ఉన్నాయి.. మరోవైపు ఆక్సిజన్ సమయానికి అందక కరోనా పేషెంట్లు చనిపోతున్నారు. రోజూ ఏదో ఒక చోట కనీసం 25 మంది ఆక్సిజన్ అందక చనిపోతున్నారంటే పరిస్ధితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోంది.

తాజాగా కర్ణాటక రాష్ట్రం మైసూర్ జిల్లాలోని చామరాజనగర్‌లో 24 మంది కరోనా పేషెంట్లు..ఆక్సిజన్ లేక చనిపోయారు. చామరాజనగర్‌కి ఆక్సిజన్ సప్లై చేసే... మైసూర్ సదరన్ గ్యాస్ ఏజెన్సీ..ఆక్సిజన్ పంపింది..కానీ ఆసుపత్రికి ఆలస్యంగా చేరేసరికి అప్పటికే 24 మంది చనిపోయారు. మైసూర్ డీసీ రోహిణీ సింధూరి... మైసూర్, మాదికేరి జిల్లాల్లో కరోనా సౌకర్యాలను చూసుకునే ఇన్‌ఛార్జిగా ఉన్నారు. రాత్రి 8.30 తర్వాత నుంచి పేషెంట్లు ఒక్కొక్కరుగా చనిపోయారు వారి బంధువులు చెబుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం మాత్రం అర్థరాత్రి 12.30 తర్వాతే చనిపోయారని అంటోంది. డీసీ రోహిణీదే తప్పు అని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. మైసూర్ నగరం నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను చామరాజనగర్ తరలించేందుకు ఆమె వెంటనే పర్మిషన్ ఇవ్వకుండా ఆలస్యం చేశారని మండిపడుతున్నారు. ఈ ఘటనపై సీఎం యడియూరప్ప స్పందించారు. ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ని ఏం జరిగిందో తెలుసుకోమని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories