మద్యం మత్తులో రెచ్చిపోతున్న మందుబాబులు

మద్యం మత్తులో రెచ్చిపోతున్న మందుబాబులు
x
Highlights

కొన్ని రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న మద్యం దుకాణాలు రీసెంట్ గా తెరుచుకోవడంతో మద్యం బాబులు రెచ్చిపోతున్నారు. మద్యం తాగిన తర్వాత మందుబాబులు వింతగా...

కొన్ని రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న మద్యం దుకాణాలు రీసెంట్ గా తెరుచుకోవడంతో మద్యం బాబులు రెచ్చిపోతున్నారు. మద్యం తాగిన తర్వాత మందుబాబులు వింతగా ప్రవర్తిస్తున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. మందు తాగిన తర్వాత పిచ్చివాళ్లుగా ప్రవర్తిస్తున్నారు. లాక్‌డౌన్ ప్రారంభించినప్పుడు మద్యం లేక కొంత మంది పిచ్చివారిగా ప్రవర్తిస్తే ఇప్పుడు మద్యం మత్తులో చిత్తుగా వ్యవహరిస్తున్నారు.

దాదాపు 45 రోజుల తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిలబడి మద్యం కొనుగోలు చేశారు. గంటల తరబడి ఎండలో నిలబడి మరీ మద్యాన్ని కొని తాగారు తాగిన మైకంలో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. మద్యం మత్తు కొందరి ప్రాణాలు తీస్తున్నాయి.

మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థం లేకుండా వ్యవహరిస్తారు. ఫూటుగా తాగి తందానాలు ఆడుతున్నారు. మద్యం మత్తులో కొంతమంది నడి రోడ్డుపైనే హల్ చల్ చేస్తున్నారు. రోడ్లపై వచ్చిపోయే వారికి ఇబ్బందులును కలిగిస్తున్నారు. అలాంటి ఘటనే ఒకటి జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మార్కెట్ రోడ్డు వద్ద మద్యం మత్తులో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. రోడ్డుపై ఉన్న రాళ్లను విసురుతూ హంగమా చేశాడు. స్థానికులతో వారితో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ సమయంలో యువకుడు మద్యం మత్తులో ఉండడంతో ఎవరు అతడిని ఆపే ప్రయత్నం చేయలేదు. మందుబాబు చేష్టలతో భయ బ్రాంతులుకు గురయ్యారు స్థానికులు. చివరకు రాళ్లను విసురుతూనే పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను పట్టుకున్నాడు దాంతో షాక్ కొట్టి యువకుడు మృతి చెందాడు.

కర్ణాటకలో ఒక యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. తన బైక్‌కు అడ్డుగా వచ్చిందని పామునే విచ్చలవిడిగా కొరికాడు. పామును మెడలో వేసుకుని నడిరోడ్డుపైనే హల్‌చల్ చేశాడు. అందరూ చూస్తుండగానే పామును నోటితో కొరికి ముక్కలు ముక్కలుగా చేశాడు. పామును చీల్చి పడేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. యువకుడి దగ్గరకు ఎవరు వెళ్లే ప్రయత్నం చేయలేకపోయారు. ఇతనిని పోలీసులు ఆ తరువాత అరెస్ట్ చేశారు.

మొత్తానికి లాక్‌డౌన్ కారణంగా వైన్ షాపులు మూసి ఉన్నప్పుడు ఏ గొడవ లేవు. కానీ, మద్యం షాపులు తెరవడంతో గొడవలు ప్రారంభం అయ్యాయి. మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. మందుబాబులకు అడ్డు అదుపులు లేకుండా పోతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories