DRDO 2DG Medicine: దేశంలో కరోనా కట్టడిలో భాగంగా పలు టీకాలు అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని ప్రయోగ దశలో ఉన్నాయి.
DRDO 2DG Medicine: దేశంలో కరోనా కట్టడిలో భాగంగా పలు టీకాలు అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని ప్రయోగ దశలో ఉన్నాయి. అయితే కొవిడ్ చికిత్సలో భాగంగా ఉపయోగించేందుకు డీఆర్డీవో 2 డీజీ (2 డీఆక్సీ డీ గ్లూకోజ్) ఔషధాన్ని తయారు చేసింది. ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి విధితమే. కొవిడ్ రోగులకు ఈ ఔషధ వినియోగించేప్పుడు జాగ్రత్తగా ఉండాలని డీఆర్డీవో స్పష్టం చేసింది. ఈమేరకు 2డీజీ వాడకంపై మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొవిడ్ చికిత్సలో భాగంగా 2డీజీ ఔషధాన్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదని, డాక్టర్ల పర్యవేక్షణ తప్పకుండా ఉండాలని వెల్లడించింది. ఓ మోస్తరు కరోనా లక్షణాల నుంచి తీవ్రంగా ఉన్నవారికి దీన్ని వాడొచ్చని పేర్కొంది. ప్రస్తుత చికిత్సకు అనుబంధంగానే దీన్ని ఉపయోగించాలని తెలిపింది. గరిష్ఠంగా 10 రోజుల లోపు 2డీజీ వాడకాన్ని డాక్టర్లు సూచించాలని తెలిపింది.
ఇతర జబ్బులు ఉన్న పేషంట్లకు 2డీజీ ఔషధం వినియోగించే ముందు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించింది. డయాబెటిస్, తీవ్రస్థాయి గుండెజబ్బులు, లివర్, కిడ్నీ వ్యాధులు, తీవ్ర శ్వాసకోశ సమస్యలున్నవారిపై 2డీజీని పరీక్షించలేదని పేర్కొంది. అలాగే 18 ఏళ్ల లోపు వారు, గర్భవతులు, పాలిచ్చే తల్లులకు ఈ మందు వాడొద్దని డీఆర్డీవో ఆదేశాలు జారీ చేసింది. 2డీజీ ఔషధం కోసం [email protected]కి వివరాలను మెయిల్ చేయాలని కోరింది.
The 2DG medicine can be given to Covid-19 patients under the care and prescription of doctors. Directions for usage of this drug for Covid-19 patients as per DCGI approval are attached here for reference. For all queries regarding #2DG, please write to [email protected] pic.twitter.com/x19ayBoToG
— DRDO (@DRDO_India) June 1, 2021
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire