Gautam Gambhir: చిక్కుల్లో గౌతం గంభీర్

Does Gautam Gambhir have license to deal in Covid drugs, asks Delhi High Court
x

Gautam Gambhir: (File Imae)

Highlights

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశంగా మారడమే కాకుండా ఆయన చిక్కుల్లో పడేలా చేసింది.

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశంగా మారడమే కాకుండా ఆయన చిక్కుల్లో పడేలా చేసింది. పడ్డాడా అంటే అవుననే అనిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...ఢిల్లీలో క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్న స‌మ‌యంలో తన నియోజకవర్గమైన ఈస్ట్ ఢిల్లీ ప్రజలకు ఉచితంగా ఫాబిఫ్లూ డ్రగ్స్ ఇస్తాన‌ని గౌత‌మ్ గంభీర్ ఇటీవల ట్విట్ చేశారు. తూర్పు ఢిల్లీకి చెందిన వాళ్లు ఎంపీ ఆఫీసుకు వచ్చి ఫ్రీగా ఫాబిఫ్లూ ఔషధాన్ని తీసుకెళ్ల‌వ‌చ్చని.. కేవ‌లం ఆధార్ కార్డు, ప్రిస్క్రిప్ష‌న్ చూపిస్తే స‌రిపోతుంది అంటూ గంభీర్ ట్వీట్ చేశారు.

ఆ తర్వాత విపక్షపార్టీలన్నీ గళమెత్తాయి. ఢిల్లీలో విపత్కర పరిస్థితులు నెలకొన్న సమయంలో జ‌నాల‌కు ఫ్రీగా పంచి పెట్టేంత స్థాయిలో ఫాబిఫ్లూ గంభీర్ ద‌గ్గ‌రికి ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి.. ఇది అక్ర‌మం కాదా..? అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ప్ర‌శ్నించాయి. ఈ తరుణంలోనే ఢిల్లీ హైకోర్టు కూడా గంభీర్‌ను పలు ప్రశ్నలు సంధించింది.

గంభీర్ ప్రకటనపై వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. కోవిడ్ -19 చికిత్సకు వాడుతున్న మందులను బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఎలా పంపిణీ చేయగలరని, వాటిని పెద్ద మొత్తంలో ఎలా సేకరించగలరని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఔషధాలను సేకరించేందుకు గంభీర్‌కు అసలు లైసెన్స్ ఉందా.. ఇలాంటి వాటికి లైసెన్స్ అవసరం లేదా ..? అంటూ జస్టిస్ విపిన్ సంఘి, రేఖ పల్లి డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. ఆ నివేదిక సమర్పించేంత వరకు దీనిపై విచారణ కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టంచేసింది. దీనిపై గంభీర్ వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

ఫాబిఫ్లు యాంటీ-వైరల్ ఔషధాన్ని తేలికపాటి నుంచి మితమైన కోవిడ్ -19 వ్యాధికి చికిత్స చేసేందుకు ఉపయోగిస్తారు. గత కొన్ని వారాలుగా ఫాబిఫ్లు, రెమిడెసివిర్ ఔషధాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ మందులను మార్కెట్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు దాడులు సైతం చేసి మందులను పట్టుకుంటున్నారు.

విచారణ సందర్భగా ఢిల్లీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా మాట్లాడుతూ.. ఇది చాలా బాధ్యతారహితమైన ప్రకటన అని వెల్లడించారు. ఈ సందర్భంగా గంభీర్ చేసిన ట్విట్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ధర్మాసనం పై విధంగా గంభీర్‌పై పలు ప్రశ్నలు సంధించింది. దీనికి సమాధానం కావాలంటూ గంభీర్‌కు నోటీసులు జారీచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories