PM Modi: ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్‌ ఆదాయం నెలకు ఎంతో తెలుసా?

Do you know how Much PM Modis YouTube Channel Earns per Month
x

PM Modi: ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్‌ ఆదాయం నెలకు ఎంతో తెలుసా?

Highlights

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ప్రధాని మోడీని ఫాలో అవుతుంటారు.

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ప్రధాని మోడీని ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టారంటే చాలు.. కోట్లలో లైకులు, షేర్లు, కామెంట్స్ వస్తుంటాయి. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు కలిగి ఉన్న రాజకీయ నేతల జాబితాలో ఆయన ముందు వరుసలో ఉన్నారు.

ఇక ప్రధాని మోడీకి అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఛానల్‌ను 2007 అక్టోబర్ 26వ తేదీన ప్రారంభించారు. ఇందులో మోడీ చేపట్టే అన్ని ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలు, ఇంటర్య్వూలు ప్రసారమవుతాయి. అయితే ఈ ఛాన‌ల్‌కు ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు, నెలకు ఎంత ఆదాయం వస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నరేంద్ర మోడీ.. భారత ప్రధానిగా మాత్రమే కాదు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరల్డ్ మోస్ట్ పవర్‌ఫుల్ లీడర్‌గానూ పాపలర్ అయ్యారు. దాదాపుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన నేతగా ఇప్పటికే మోడీ రికార్డులకెక్కారు. ప్రత్యేకించి తాజాగా యూబ్యూబ్ ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతూ మోడీ సరికొత్త రికార్డులను నెలకొల్పారు. వ్యక్తిగత ఖాతా కేటగిరిలో మోడీ యూట్యూబ్ ఛానెల్ ఒక్క నెలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే మోడీ ఈ ఛానెల్‌ను ఏదో ఆదాయ ఆర్జన కోసం ప్రారంభించినది కానప్పటికీ.. నెలకు కోట్లాది రూపాయలను ఆ ఛానెల్ మోడీకి సంపాదించి పెడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో 20 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఏకైక రాజకీయ నేతగా నరేంద్ర మోడీ తొలి స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా వ్యూస్, లైక్స్, ద్వారా నరేంద్ర మోడీ ఛానెల్ ప్రతి నెలా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఓ నివేదిక ప్రకారం నరేంద్ర మోడీ యూబ్యూబ్ ఛానల్ ఆదాయం నెలకు 1.89 లక్షల డాలర్ల నుంచి 5.67 లక్షల డాలర్ల మధ్య ఉంటుందని తేలింది. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.1.62 కోట్ల నుంచి రూ.4.88 కోట్ల ఆదాయం అన్నమాట.

ఈ ఛానెల్‌కు 26 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటివరకు 29,272 వీడియోలు పోస్ట్ అయ్యాయి. ఇక ఆ వీడియోలకు మొత్తం 636 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన చాలా వీడియోలు 40 వేల వ్యూస్ దాటుతున్నాయి. సబ్‌స్క్రైబర్ల సంఖ్య కూడా భారీగానే పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఛానల్‌లో ప్రతి వారం సగటున 19 వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. మరోవైపు మోడీకి ఫేస్‌బుక్‌లో 48 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్ లో 82.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తర్వాత యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ పరంగా బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనార్ రెండో స్థానంలో ఉన్నారు. జైర్ బోల్సోనార్‌కు 6.4 మిలియన్ల సబ్‌స్కైబర్స్ ఉండగా.. మోడీ సబ్‌స్క్రైబర్స్‌తో పోల్చితే ఈ సంఖ్య 4వ వంతు మాత్రమే ఉండడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories