బీహార్ 'బీజేపీ' ఎన్నికల ఇంచార్జ్ గా దేవేంద్ర ఫడ్నవిస్

బీహార్ బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ గా దేవేంద్ర ఫడ్నవిస్
x
Highlights

బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పనితీరుకు బీహార్ ఎన్నికలు కొలమానంగా ఎంచుకుంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి...

బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పనితీరుకు బీహార్ ఎన్నికలు కొలమానంగా ఎంచుకుంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జేడీయూతో కలిసి మరోసారి ప్రభుత్వాన్నిఏర్పాటు చేయాలని తహతహలాడుతోంది. అందులో భాగంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ను బీహార్‌ లో ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించారు. బీజేపీ అధ్యక్షుడు జీపీ నడ్డా ఫడ్నవిస్ ను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఫడ్నవిస్.. తనపై ఉంచిన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేరుస్తానని అన్నారు. బీహార్‌లోని మహాగడ్భందన్ కంటే బిజెపి కూటమి బలంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని నొక్కి చెప్పారు. కాగా బీహార్‌లో అక్టోబర్ 28, నవంబర్ 3 మరియు నవంబర్ 7 న మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఎన్డీఏ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉన్నారు. ఇటు మహాకూటమికి మాత్రం ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారు కాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories