PM Security: ప్రధాని మోడీ సెక్యూరిటీ టీమ్‌లోకి శునకరాజం..

Desi Dog Breed Included in PM Modis Security
x

PM Security: ప్రధాని మోడీ సెక్యూరిటీ టీమ్‌లోకి శునకరాజం..

Highlights

PM Security: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భద్రత కల్పించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ టీమ్‌లోకి కొత్తగా దేశీయ ఫైటర్ డాగ్‌ చేరింది.

PM Security: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భద్రత కల్పించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ టీమ్‌లోకి కొత్తగా దేశీయ ఫైటర్ డాగ్‌ చేరింది. ఎస్పీజీలో భాగమైన తొలి దేశీయ శునకం ఇదే కావడం విశేషం.. ఈ శునకాన్ని కర్ణాటకలోని భాగల్‌ కోట జిల్లాలోని తిమ్మాపూర్‌లోని శునక పరిశోధన, సమాచార కేంద్రం నుంచి సైన్యం ముధోల్‌ హౌండ్‌ జాతి డాగ్‌ను సేకరించింది. దానికి శిక్షణ ఇచ్చిన అనంతరం ఎస్పీజీకి అప్పగించారు. ఈ కుక్కలకు ముధోల్‌ అనే పేరు దక్కన్‌ రాజ్యమైన ముధోల్‌ నుంచి వచ్చింది. అప్పట్లో ముధోల్‌ రాజ్యానికి చెందిన రాజు మలోజీరావు ఘోర్‌పేడ్‌ ఈ శునకాలను పెంచారట. అంతేకాదు.. ఇంగ్లాండ్‌ పర్యటనలో కింగ్‌ జార్జ్‌-5కు రెండు డాగ్స్‌ను బహూకరించినట్టు చెబుతున్నారు.

ఈ శనకాలు అలుపు లేకుండా పరుగెడుతాయి. వేటాడడంలో అత్యంత చురుకుదనాన్ని ప్రదర్శిస్తాయి. ధైర్య సాహసాలతో పాటు యజమాని పట్ల అంతే విధేయతను ప్రదర్శిస్తాయి. అందుకే ఎస్పీజీలోకి ఈ ఫైటర్‌ డాగ్‌ను తీసుకున్నారు. అయితే ప్రధాని సెక్యూరిటీ టీమ్‌లోకి దేశీయ శునక రాజాలను చేర్చాలని ఎస్పీజీ భావించింది. అందుకు తమిళనాడుకు చెందిన రాజపాళయం జాతి, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జాతి, బాగల్‌కోటలోని ముధుల్‌ జాతి కుక్కలను పరిశీలించారు. చివరికి ముధోల్ జాతి శునకాలను PM భద్రతా బృందం ఎంపిక చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories