Rs 42 LPA Package: 42 లక్షల జీతం.. 80 రూపాయల తగ్గింపు కోసం 42 నిమిషాలు ఆగాడు

Rs 42 LPA Package: 42 లక్షల జీతం.. 80 రూపాయల తగ్గింపు కోసం 42 నిమిషాలు ఆగాడు
x
Highlights

Rs 42 LPA package: అతడి జీతం ఏడాదికి రూ. 42 లక్షలు. కానీ జెప్టో యాప్‌లో రూ. 80 సర్జ్ చార్జ్ తగ్గడం కోసం 42 నిమిషాలు వేచిచూశాడు. ఈ విషయాన్ని చెప్పింది...

Rs 42 LPA package: అతడి జీతం ఏడాదికి రూ. 42 లక్షలు. కానీ జెప్టో యాప్‌లో రూ. 80 సర్జ్ చార్జ్ తగ్గడం కోసం 42 నిమిషాలు వేచిచూశాడు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా అతడి గళ్ ఫ్రెండే. అవును, ఎక్స్ వేదికగా అను అనే యువతి పోస్ట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ట్వీట్‌లో యువతి ఏం రాశారంటే.. నా బాయ్ ఫ్రెండ్ ఏడాదికి రూ. 42 లక్షల ప్యాకేజ్ సంపాదిస్తున్నారు. కానీ జెప్టో యాప్‌లో రూ. 80 సర్ చార్జ్ తగ్గడం కోసం 42 నిమిషాలు వెయిట్ చేశాడు అని పేర్కొన్నారు. క్షణాల్లోనే ఆ యువతి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

ఇంతకీ సర్జ్ చార్జ్ అంటే తెలిసిందే కదా.. జెప్టో, స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరి యాప్స్.. అలాగే రాపిడో, ఓలా లాంటి రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్స్ డిమాండ్ అధికంగా ఉండే వేళల్లో సర్జ్ చార్జ్ పేరిట ఎప్పుడూ ఉండేదానికంటే ఇంకొంత ఎక్కువగా చార్జ్ చేస్తుంటాయి. రద్దీ వేళలు ముగిసిన తరువాత ఆ సర్జ్ చార్జ్‌ని తగ్గించి, ఎప్పుడూ ఎంతయితే చార్జ్ చేస్తారో, అంతే చేస్తారు. ఇక్కడ యువతి బాయ్ ఫ్రెండ్ కూడా ఆ సర్జ్ చార్జ్ తగ్గడం కోసమే వేచిచూశారు.

అను చేసిన ట్వీట్‌పై నెటిజెన్స్ మిశ్రమ స్పందన కనబరుస్తున్నారు. కొంతమంది ఆ యువతి తీరును తప్పుపట్టారు. జీతం ఎంతయితే ఏం.. అది కష్టపడి సంపాదించిందే కదా. అలాంటప్పుడు ఆగడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. డబ్బుల కోసమే అబ్బాయిలను ప్రేమించే వారికి ఇలాంటి విషయాలు అర్థం కావు అని కామెంట్ చేశారు. ఇంకొంతమంది అతడికి సంపాదించడమే తెలుసు కానీ రిచ్‌గా ఉండటం తెలీనట్లుంది అని కామెంట్ చేశారు.


తన ట్వీట్ కింద వస్తోన్న కామెంట్స్‌కి ఆ యువతి స్పందిస్తూ తన బాయ్ ఫ్రెండ్ వైఖరిని తాను కూడా సమర్ధిస్తున్నాని స్పష్టం చేశారు. కష్టపడి సంపాదించిన సొమ్మును ఆదా చేసుకోవడం కోసం కాసేపు వేచిచూడటంలో తప్పు లేదులే అని బదులిచ్చారు. అదే సమయంలో తన బాయ్ ఫ్రెండ్‌ని తక్కువ చేస్తూ కామెంట్ చేసిన వారికి కూడా ఆమె రిప్లై ఇచ్చారు. అతడికి సంపాదించడమూ తెలుసు.. రిచ్‌గా ఉండటం కూడా తెలుసు అని తన బాయ్ ఫ్రెండ్‌ని వెనకేసుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories