Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి దిల్లీ యూనివర్సిటీ నోటీసులు!

Delhi University Send Notices To Rahul Gandhi
x

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి దిల్లీ యూనివర్సిటీ నోటీసులు!

Highlights

Rahul Gandhi: నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన యూనివర్సిటీ

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కష్టాలు చుట్టుముడుతున్నాయి. 'మోదీ' ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో దోషిగా తేలిన రాహుల్.. లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు. ఈ కేసులో ఆయనకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఈ వ్యాఖ్యల కేసులో దేశంలోని పలు ప్రాంతాల్లో రాహుల్‌పై కేసులు నమోదయ్యాయి.

తాజాగా ఢిల్లీ యూనివర్సిటీ రాహుల్‌కు నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. గత శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెన్స్ హాస్టల్‌ను సందర్శించిన రాహుల్ వారితో కలిసి భోజనం చేశారు.రాహుల్ ఇలా అనధికారికంగా యూనివర్సిటీని సందర్శించడం వల్ల విద్యార్థుల భద్రత ప్రమాదంలో పడుతుందని భావించిన యూనివర్సిటీ ఈ రోజు ఆయనకు నోటీసులు పంపనుంది.రాహుల్ యూనివర్సిటీకి రావాలనుకున్నప్పుడు సరైన ప్రొటోకాల్ అవసరం అని ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వికాశ్ గుప్తా తెలిపారు. భవిష్యత్తులో క్యాంపస్‌లోకి అనధికారికంగా అడుగుపెట్టకుండా ఉండేలా ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories