ఢిల్లీలో డాక్టర్ల ఆందోళన.. వైద్య సేవలు నిలిచిపోతాయా?

Delhi Resident Doctors Protest Over the Delay in NEET-PG Counselling
x

ఢిల్లీలో డాక్టర్ల ఆందోళన.. వైద్య సేవలు నిలిచిపోతాయా?

Highlights

NEET-PG Counselling: నీట్ - పీజీ 2021 కౌన్సిలింగ్ ఆలస్యాన్ని నిరసిస్తూ ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు.

NEET-PG Counselling: నీట్ - పీజీ 2021 కౌన్సిలింగ్ ఆలస్యాన్ని నిరసిస్తూ ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి నుంచి ర్యాలీగా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన తెలుపుతున్నవారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఆసుపత్రిలోని అన్ని ప్రధాన గేట్లను మూసేశారు. దీంతో లోపలే పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగుతున్నాయి.

చివరి ప్రయత్నంగా ఈ నిరసన తెలుపుతున్నామని కానీ, ప్రభుత్వం వినడం లేదని రెసిడెంట్ వైద్యులు అంటున్నారు. మరోవైపు స్థానిక ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. తాజాగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ సైతం రేపు ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన బాట పట్టడంతో ఆస్పత్రులలో పెషేంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జౌట్ షేషెంట్ విభాగంలో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్పత్రులకు వచ్చిన పెషేంట్లు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని పలు పెద్ద పెద్ద ఆస్పత్రులలో ఇదే పరిస్థితి నెలకొంది.

ఎప్పుడో జరగాల్సిన నీట్ పరీక్ష కొవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో పరీక్ష నిర్వహించారు. ఫలితాలు కూడా విడదలయ్యాయి. అయితే EWS కోటాకు సంబంధించిన వివాదం కొనసాగతున్న నేపథ్యంలో కౌన్సిలింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన విచారణ జరుగుతుంది. నీట్ పీజీ కౌన్సిలింగ్ వాయిదా పడటంతో దేశంలోని పలుచోట్ల రెసిడెంట్ డాక్టర్లు నిరసన బాటపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories