Delhi: ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత

Delhi Recommends Ending Weekend Curfew | National News Today
x

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత 

Highlights

Delhi: ఇప్పటి వరకు షాపులకు ఉన్న సరి బేసి సంఖ్య విధానం రద్దు

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో క్రమంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అమలులో ఉన్న వీకెండ్ కర్ఫ్యూను ఎత్తి వేసింది. 50శాతం సామర్థ్యంతో ప్రైవేటు కార్యాలయాలకు అనుమతి ఇచ్చింది. ఢిల్లీలో ఇప్పటి వరకు షాపులకు ఉన్న సరి బేసి సంఖ్య విధానాన్ని రద్దు చేసింది. ప్రతిపాదనను ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపించింది.

ఢిల్లీలో కరోనా కేసులు పెరగడంతో వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం జనవరి 4న ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ అమలు చేసింది. అంతకుముందే ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ను అమలు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories