Delhi Mayor: ముచ్చటగా మూడోసారి ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా

Delhi Mayor Election Adjourned for Third Time
x

Delhi Mayor: ముచ్చటగా మూడోసారి ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా 

Highlights

Delhi Mayor: ఆప్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

Delhi Mayor: ఢిల్లీలో మేయర్ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. మేయర్‌ను ఎన్నుకునేందుకు ఇవాళ మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. అయితే ఓటింగ్ హక్కుల అంశంలో లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేపట్టింది. దీంతో మేయర్ ఎన్నికను మరోసారి వాయిదా వేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 15 ఏళ్ల తర్వాత బీజేపీ తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. నామినేట్ అయిన 10 మంది కౌన్సిలర్లు కూడా ఓటింగ్‌లో పాల్గొనేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. ఆ నిర్ణయాన్ని ఆప్ వ్యతిరేకించింది. దీంతో మేయర్ ఎన్నిక సమయంలో ఆప్, బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ఈ కారణంగానే రెండుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది. అయితే ఇవాళ కూడా అదే సీన్ రిపీటైంది. డీఎంసీ చట్టాన్ని సక్సేనా అతిక్రమించినట్లు ఆప్ ఆరోపిస్తోంది.

250 వార్డులున్న ఢిల్లీలో 134 సీట్లు ఆప్ గెలవగా..104 సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. ఢిల్లీలోని బీజేపీకి చెందిన 7 లోక్‌సభ ఎంపీలు, ఆప్‌కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు, 14 మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. జనవరి 6న జరిగిన మేయర్ ఎన్నిక తొలి సమావేశంలో బీజేపీ, ఆప్ నేతలు కొట్టుకున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories