G20 శిఖరాగ్ర సదస్సుకు సిద్ధమవుతున్న ఢిల్లీ

Delhi Is Gearing Up For The G20 Summit
x

G20 శిఖరాగ్ర సదస్సుకు సిద్ధమవుతున్న ఢిల్లీ

Highlights

G20 Summit 2023: 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు

G20 Summit 2023: దేశ రాజధాని న్యూఢిల్లీ G20 శిఖరాగ్ర సదస్సుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 8 9 10 తేదీల్లో జరిగే ఈ సదస్సును భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సదస్సు జరగనున్న నేపథ్యంలో మూడు రోజులు పాటు ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, దుకాణాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసివేయునున్నారు. సదస్సుకు హాజరవుతున్న భాగ్యస్వామ్య దేశాల నేతల భద్రత దృష్ట్యా మూడు రోజులు ఢిల్లీలోని అన్ని మాల్స్ మార్కెట్లు మూసి ఉంచాలన్న పోలీస్ శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ , లెఫ్ట్నెంట్ గవర్నర్ వినయ్ సక్సేన ఆమోదం తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా సుప్రీంకోర్టు, సెంట్రల్ సెక్రటేరియెట్ సహా కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేయనున్నారు. ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలలో ప్రభుత్వ బస్సుల రాకపోకలను తగ్గించనున్నారు. సదస్సుకు 20 దేశాల అధినేతలు సహ 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories