Delhi Government: : 2 నెలలు బార్ల లైసెన్స్ ఫీజ్ రద్దు…ఎక్కడో తెలుసా

Delhi Government Allows Waiver in Licence fee for Bars, Hotels
x

 Licence fee for Bars, Hotel:(File Image)

Highlights

Delhi Government: హోటల్స్, రెస్టారెంట్లలోని బార్స్ ‌కు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

Delhi Government: కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. అందులో భాగంగా హోటల్స్, రెస్టారెంట్లలోని బార్స్ ‌కు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వాటి రెండు నెలల లైసెన్స్ ఫీజులను రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో 2 నెలల పాటు బార్లు, రెస్టారెంట్స్, హోటల్స్ మూతపడ్డాయని.. అందువల్ల వారందరికీ ఈ అవకాశం కల్పించినట్లు ఢిల్లీ సర్కార్ పేర్కొంది. అదే విధంగా సెకండ్ క్వార్టర్ లైసెన్స్ ఫీజు గడువును కూడా ఢిల్లీ సర్కార్ పొడిగించింది. జూన్ 30తో ముగిసిన గడువును.. జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ గడువులోగా బార్ల లైసెన్స్‌ లు కలిగినవారు.. బ్యాలెన్స్ అమౌంట్ చెల్లించాలని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories