Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన

Delhi CM Kejriwal sensational announcement
x

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన

Highlights

Arvind Kejriwal: రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న కేజ్రీవాల్

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన ఆప్ కార్యకర్తల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండబోనని స్పష్టం చేశారు. రాజీనామా తర్వాత తిరిగి ప్రజల్లోకి వెళ్తానన్న ఆయన, ఇంటింటికీ వెళ్లి ప్రజా తీర్పు కోరతానన్నారు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలన్నారు. తాను రాజీనామ చేశాక, ఆప్ నుంచి మరొకరు సీఎం అవుతారని స్పష్టం చేశారు. నవంబర్‌లో మహారాష్ట్రతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు. తాను నిర్దోషినని నమ్మితేనే ప్రజలు ఓట్లు వేయాలని కోరారు కేజ్రీవాల్.

Show Full Article
Print Article
Next Story
More Stories