బిహార్​లోని పట్నా ఎయిర్​పోర్ట్​ బాంబు బెదిరింపు

Delhi-Bound IndiGo flight grounded at Patna Airport After Bomb Threat Passenger Arrested
x

బిహార్​లోని పట్నా ఎయిర్​పోర్ట్​ బాంబు బెదిరింపు

Highlights

*దిల్లీ వెళ్లే ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్​చల్​ సృష్టించాడు

IndiGo flight: బిహార్​లోని పట్నా ఎయిర్​పోర్ట్​ నుంచి దిల్లీ వెళ్లే ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్​చల్​ సృష్టించాడు. తన బ్యాగులో బాంబు ఉందని అందర్నీ భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో వెంటనే అధికారులు విమానాన్ని అత్యవసరంగా పట్నా విమానాశ్రయంలోనే నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులను సురక్షితంగా దించేశారు అధికారులు. హుటాహుటిన బాంబు స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​ నిపుణులు, పోలీసులు విమానం వద్దకు చేరుకున్నారు. ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ప్రయాణికుడి బ్యాగులో ఎటువంటి బాంబు లేదని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories