Delhi Air Quality: దీపావళికి ముందే ఢిల్లీలో డేంజర్ బెల్స్

Delhi Air Quality Decrease Before Diwali
x

Delhi Air Quality: దీపావళికి ముందే ఢిల్లీలో డేంజర్ బెల్స్

Highlights

Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. దీపావళి పండుగకు ముందే డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. దీపావళి పండుగకు ముందే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఢిల్లీలో బుధవారం గాలి నాణ్యత 230 ఉండగా, లేటెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 293గా నమోదైంది. కాలుష్య తీవ్రత తగ్గించేందుకు అధికారులు ఫాగింగ్ చేస్తున్నారు. మరో వైపు పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పొల్యూషన్ కంట్రోల్‌ కోసం కొత్త విధానాలు చేపట్టినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. ఢిల్లీలోని 13 ప్రాంతాలను పొల్యూషన్ హాట్‌స్పాట్స్‌గా గుర్తించినట్లు చెప్పారు. వీటిని గ్రీన్ వార్ రూమ్ నుంచి కమాండ్ చేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం దృష్ట్యా ఇప్పటికే బాణాసంచా వాడకంపై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిషేధం విధించింది. వచ్చే ఏడాది జనవరి వరకు బాణాసంచా తయారీ, వినియోగం, అమ్మకాలు నిలిచిపోనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories