Delhi: ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్‌ దుర్ఘటనపై రాజ్యసభలో చర్చ

Debate in Rajya Sabha on Coaching Center incident in Delhi
x

Delhi: ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్‌ దుర్ఘటనపై రాజ్యసభలో చర్చ

Highlights

Delhi: కోచింగ్‌ సెంటర్లు వ్యాపారమయంగా మారిపోయాయి

Delhi: ఢిల్లీలో ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో జరిగిన దుర్ఘటనపై రాజ్యసభలో చర్చకు వచ్చింది. కోచింగ్‌ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయని సభ ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు న్యూస్‌ పేపర్‌ చదువుదామని తెరిచినా రెండు పేజీలు ఈ సంస్థల ప్రకటనలే ఉంటాయని వ్యాఖ్యానించారు. దీనిపై అన్ని పక్షాలతో కలిపి ఇన్‌-ఛాంబర్‌ మీటింగ్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు ఛైర్మన్ వెల్లడించారు. ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్ధులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.

ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని, జవాబుదారీతనం నెలకొనేలా చూస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం తమ బాధ్యతని మంత్రి వివరించారు. శనివారం రావూస్‌ స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ముగ్గురు సివిల్ సర్వీస్‌ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. మూడంతస్తుల భవనంలో సెల్లార్‌ను స్టోర్‌ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. అక్రమంగా నడిపిస్తున్న 13 కోచింగ్‌ సెంటర్లకు ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సీల్‌ వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories