Wayanad Death Toll Rise : వయనాడ్ విలయం..308కి పెరిగిన మృతుల సంఖ్య
Wayanad Death Toll Rise : కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.తాజాగా మృతుల సంఖ్య 308కి చేరుకుంది. మృతుల్లో 25 మంది చిన్నారులు, 70మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఇంకా 200 మంది ఆచూకీ లభించడంలేదని చెప్పారు.
Wayanad Death Toll Rise : కేరళలోని వయనాడ్ విలయం తీవ్ర విషాదాన్ని నింపింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 308కి చేరుకుంది. మండక్కై, చూరాల్ మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో దాదాపు 40 బ్రుందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్ాయయి. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, నేవీతోపాటు ఇతర సహాయక బ్రుందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ లో బిజీగా ఉన్నాయి. ఇప్పటి వరకు సైన్యం వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించాయి.
ప్రకృతి సృష్టించే విపత్తును అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ఆ విపత్తును ముందుగానే ఊహిస్తే కాస్త నష్టాన్ని నివారించగలము తప్పా చేసేదేమీ ఉండదు. అలాంటి అవకాశాన్ని ఇస్రో అందించింది. ఈ సంస్థ రూపొందించి ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా 20ఏండ్లుగా వయనాడ్ జిల్లాతోపాటు కేరళలోని ప్రమాదకరమైన ప్రాంతాలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించింది. దీనిలో భాగంగా తాజాగా వయనాడ్ జిల్లాలో విలయాన్ని చిత్రీకరించింది.
వయనాడ్ లో కొండచరియలు జారిపడిన ద్రుశ్యాన్ని విలయానికి ముందు విలయం తర్వాత ఫొటోలను ఆ ప్రాంతాలపై దృష్టి సారించి కార్టో శాట్ 3 ఆర్ఐఎస్ఏటీ ఉపగ్రహాలు వాటిని రికార్డు చేశాయి. ఇస్రో అనుబంధ సంస్థ అయిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంతరిక్షం నుంచి తీసిన ఈ 3డీ ఫొటోలను విశ్లేషించింది.
ఫొటోల ప్రకారం సముద్రమట్టానికి 1,550 మిటర్ల ఎత్తు నుంచి కొండచరియలు విరిగిపడగా..ఈ ప్రభావంతో 86వేల కిలోమీటర్ల దూరం వరకు వేగంగా కొట్టుకుపోయింది. ఈ ధాటికి నది ఒడ్డు భాగం ఒరుసుకుపోయినట్లు ఈ నివేదికలు తెలిపారు. విలయం తర్వాత రికార్డైన 3డీ చిత్రాల్లో గుర్తించిన కిరీటం వంటి ప్రాంతమంతా భారీ వర్షానికి విరిగిపడినట్లు ఇస్రో తెలిపింది. ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు 80వేలకు పైగా కొండచరియలు విరిగిపడిన చిత్రాలను రికార్డు చేసింది.
Heavy rain wreck havoc in Northern Kerala.Massive landslides reported in two places in Wayanad district. *19* dead bodies recovered so far. Death toll is likely to rise. Special rescue teams are deployed in the region including State, National disaster forces and armed forces. pic.twitter.com/h8gT2dTpds
— AIR News Trichy (@airnews_trichy) July 30, 2024
2023లోనే ప్రస్తుతం సంభవించిన ప్రమాదాన్ని అంచనా వేసింది. ఈ రిపోర్ట్స్ కేవలం కేరళలోనే కాదు..దేశంలో ఏప్రాంతంలోనై ప్రక్రుతి విపత్తును గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ గతంలో వెల్లడించిన విషయాన్ని మరోసారి ఇస్రో గుర్తు చేసింది.
With the recovery of more bodies till Thursday night, the toll from the massive landslides in Kerala’s Wayanad has reached 297. More than 240 people are missing as rescue operations continued into the third day. The death toll may rise further, as officials say there are dozens… pic.twitter.com/RCTrQahXZI
— Maktoob (@MaktoobMedia) August 1, 2024
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire