Delhi Incident: సివిల్ అభ్యర్థుల మృతి..దర్యాప్తు కమిటీని నియమించిన హోం మంత్రిత్వ శాఖ

Death of Civil Candidates..Home Ministry Appointed Inquiry Committee
x

Delhi Incident: సివిల్ అభ్యర్థుల మృతి..దర్యాప్తు కమిటీని నియమించిన హోం మంత్రిత్వ శాఖ

Highlights

Delhi Incident: సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్ ఐఏఎస్ స్టడీ సెంటర్ లో వరదనీరు పోటేత్తి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఓ కమిటీని కేంద్రం హోం శాఖ నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 30 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనుంది.

Delhi Incident:సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్ ఐఏఎస్ స్టడీ సెంటర్ లో వరదనీరు పోటేత్తి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఓ కమిటీని కేంద్రం హోం శాఖ నియమించింది.హోం మంత్రిత్వ శాఖ ఈ కమిటీలో భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి, హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక CP, ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సలహాదారు, జాయింట్ సెక్రటరీ మరియు హోం మంత్రిత్వ శాఖ కన్వీనర్ ఉంటారు. హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసి, ప్రమాదం ఎందుకు జరిగింది. ఎవరు బాధ్యులు. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రమాదాలను ఎలా నివారించవచ్చనే దానిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కోరింది. అలాగే 30 రోజుల్లోగా కమిటీ తన నివేదికను సమర్పిస్తుంది.

దర్యాప్తు కొనసాగిస్తూనే, ఢిల్లీ పోలీసులు పరిశుభ్రత కోసం తీసుకున్న చర్యల గురించి సమాచారం కోరుతూ MCDకి లేఖ రాశారు. జూలై 27న ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనకు సంబంధించి నమోదైన కేసు దర్యాప్తులో సమాచారం కోరుతూ ఎంసీడీకి నోటీసు పంపినట్లు ఢిల్లీ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌పై పౌర సంస్థకు ఏదైనా ఫిర్యాదు చేశారా? దానికి ప్రతిస్పందనగా ఏమి తీసుకున్నారని కూడా పోలీసులు అడిగారు.

దీనికి ముందు కేంద్ర హోంమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడారు. ఐఏఎస్ విద్యార్థుల దుర్మరణానికి కారణం నిర్లక్షమే అన్నారు. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా బాధ్యులను గుర్తించాలని..ఇందులో రాజకీయాలకు తావీయరాదన్నారు. నిర్లక్ష్యం జరిగినప్పుడు దీనికి ఎవరో ఒకరు బాధ్యత వహించాలని..అందువల్ల పరిష్కారం కనుగొనవచ్చన్నారు. ఢిల్లీ ఘటనకు సంబంధించి సోమవారం నాడు ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా..కోర్టుకు వారికి 14రోజుల జ్యుడిషియల్ కస్టడి విధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories