Moderna Vaccine: భారత్‌లో త్వరలోనే మరో కొవిడ్‌ టీకా

DCGI Approves Americas Moderna Vaccine
x
మోడేర్న వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Moderna Vaccine: అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌ * మోడెర్నా టీకాకు డీసీజీఐ ఆమోద ముద్ర

Moderna Vaccine: భారత్‌లో త్వరలోనే మరో కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌ రాకకు మార్గం సుగమమైనట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు వెల్లడించారు. అత్యవసర వినియోగం కోసం భారతీయ అనుబంధ సంస్థ సిప్లా ద్వారా మోడెర్నా చేసుకున్న దరఖాస్తుకు డీసీజీఐ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. తాజా అనుమతితో.. సిప్లా ద్వారా మోడెర్నా వ్యాక్సిన్‌ను భారత్‌కు దిగుమతి చేసుకోవడానికి అవకాశం లభించిందన్నారు. దీంతో దేశంలో వినియోగానికి అందుబాటులోకి వచ్చిన టీకాల సంఖ్య నాలుగుకు పెరిగిందన్నారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-విలను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.

ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లనూ భారత్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం డీసీజీఐ నుంచి అనుమతి వచ్చింది. దానివల్ల ఆ వ్యాక్సిన్‌ దిగుమతికి మార్గం ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారన్నది మున్ముందు తెలుస్తుందని మాత్రమే పేర్కొన్నారు. 28 రోజుల వ్యవధిలో మోడెర్నా రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories