Darbhanga Blast Case: భారత్ పై లష్కర్ ఉగ్రయుద్ధం.. ఒక్కో బ్లాస్ట్ కు కోటి నజరానా

Darbhanga Station Blast Case Latest Update
x

Darbhanga Blast Case: భారత్ పై లష్కర్ ఉగ్రయుద్ధం.. ఒక్కో బ్లాస్ట్ కు కోటి నజరానా

Highlights

Darbhanga Blast Case: ఒక్క పేలుడు ఎన్నో సంచనాలకు కేరాఫ్‌గా మారింది.

Darbhanga Blast Case: ఒక్క పేలుడు ఎన్నో సంచనాలకు కేరాఫ్‌గా మారింది. దర్భంగాలో తీగ లాగితే హైదరాబాద్‌లో డొంక కదిలింది. హైదరాబాద్‌లో విచారిస్తే యూపీలో మూలాలు బయటపడ్డాయి. కోడింగ్‌‌లో మాటలు. యూ ట్యూబ్‌ లింక్‌లతో బాంబుల తయారీలు రన్నింగ్ ట్రైన్‌లో బాంబు బ్లాస్ట్ చేయాలని కన్నింగ్ ఆలోచనలు దర్భంగా పేలుడు కేసును విచారిస్తున్న ఎన్‌ఐఏ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఒక్కో బ్లాస్ట్‌కు ఒక్కో రేటు పేలుళ్లకు కోట్లాది రూపాయల ఇస్తామంటూ ఆఫర్ చేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురుని అరెస్ట్ చేసింది. ఈ ఉగ్రకుట్రకు సలీమే మాస్టర్‌ మైండ్ అని ఎన్‌ఐఏ తేల్చేసింది.

దర్భంగా పేలుళ్ల కేసును చేధిస్తున్న ఎన్ఐఏకి షాకింగ్ వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో తొవ్వేకొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దర్భంగాలో తీగ లాగితే హైదరాబాద్‌లో డొంక కదిలింది. దాంతో హైదరాబాద్‌ మల్లేపల్లిలో నసీర్ మాలిక్, ఇమ్రాన్‌లను అరెస్ట్ చేసి పాట్నాకు తరలించారు. మాలిక్ బ్రదర్స్ ఇచ్చిన సమాచారంతో యూపీలో మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. మరోవైపు దర్బంగా పేలుడు కేసును యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది.

లష్కరే తోయిబాకు చెందిన సలీమ్, కాపీల్‌ను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. దర్భంగా పేలుళ్లలో సలీమే మాస్టర్ మైండ్ అని ఎన్ఐఏ తేల్చేసింది. సలీమ్ నిత్యం ఐఎస్‌ఐతో టచ్‌లో ఉండేవాడని దాంతోనే దేశంలో పేలుళ్ల కుట్ర చేయాలని ఎన్‌ఐఏ తేల్చింది. అంతేకాదు మాలిక్ బ్రదర్స్‌ను సలీమ్‌ లష్కరే తోయిబాలో చేర్పించాడు. 2012లో మాలిక్ బ్రదర్స్‌ పాకిస్థాన్‌ వెళ్లేందుకు కూడా సలీమ్‌ సహాయం చేసినట్టు తెలుస్తోంది. మాలిక్ బ్రదర్స్‌తో సలీమ్ కోడ్ భాషలోనే మాట్లాడుకునేవారని వారి కోడ్ భాషను ఎన్‌ఐఏ డీ కోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సలీమ్‌‌కు పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఎల్ఈటీ ఆపరేటర్ ఇక్బాల్‌ ఖన్నాతో కూడా సలీమ్‌కు లింక్ ఉన్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది.

సలీమ్ ఐఈడీ బాంబుల తయారీలో మాలిక్ బ్రదర్స్‌కు శిక్షణ కూడా ఇచ్చాడు. అంతేకాదు ఇందుకోసం యూపీ నుంచి ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చి మరీ నసీర్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. రన్నింగ్ ట్రైన్‌లో బాంబు బ్లాస్ట్ చేయాలని అందుకోసం భారీ మొత్తంలో డబ్బులను కూడా ఆఫర్ చేసినట్టు ఎన్ఐఏ గుర్తించింది. దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో రెండు బోగీలను పేల్చేయ్యాలని కుట్ర చేశారు. అందుకోసం భారీ స్కెచ్ ‌కూడా గీసినట్టు తెలుస్తోంది.

బాంబు బ్లాస్ట్‌లు చేసేందుకు ఇక్బాల్ ఖన్నా, సలీమ్‌లు పెద్ద ఎత్తున నిధులు సేకరించారు. పాకిస్థాన్ నుంచి కూడా నిధులు తెప్పించినట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఆ డబ్బులతోనే బ్లాస్ట్‌లకు ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఒక్కో బ్లాస్ట్‌కు ఒక్కో రేటు ను ఫిక్స్ చేశారు. స్లిపర్ సెల్స్‌గా పని చేసేవారికి భారీగా డబ్బులను ఆఫర్ చేసి ప్లాన్ వేశారు. ఒక బ్లాస్ట్ చేస్తే కోటి రూపాయలు ఇస్తామని లష్కరే తోయిబా ఆఫర్ చేసింది. అంతేకాదు దర్భంగా పేలుడుకు కోట్లలో డీల్ కుదుర్చుకున్నారు.

ఇప్పటి వరకు దర్బంగా పేలుడు కేసులో ఎన్ఐఏ నలుగురిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌లో ఇద్దరిని, యూపీలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో ఎన్ఐఏ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories