అమెరికాలో ప్రమాదకర స్థాయిలో మంచు తుఫాన్‌

Dangerous Snowstorm in America Texas City
x
File image
Highlights

* టెక్సాస్‌లో మంచు బీభత్సంతో ఘోర రోడ్డు ప్రమాదం * రోడ్డుపై ఒకదానికొకటి ఢీకొన్న 130 వాహనాలు * రెండు కిలోమీటర్ల మేర చిందరవందరగా పడిన వాహనాలు

అమెరికాలో మంచు ప్రభావం ప్రమాదకర స్థాయికి చేరింది. నిన్న టెక్సాస్‌లో కురిసిన మంచు వర్షంతో వందకు పైగా వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. రోడ్డును కప్పేసిన మంచు, విజిబులిటీ లేకపోవడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఒకటి కాదు రెండు కాదు వరుసగా 130 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మైలున్నర మేర వాహనాలు చిందరవందరగా పడిపోయాయి. మంచు వర్షం, టైర్లు పట్టు కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా 36 మంది గాయపడ్డారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories