Corona Cases: ఊసరవెల్లిలా మారిన మహమ్మారి.. ప్రాంతానికో రకం మ్యూటెంట్

Daily Corona Cases Raising Rapidly in UP Delhi Haryana Uttarakhand States of India
x

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

Highlights

Corona Cases: కరోనా సెకండ్ వేవ్‌తో పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Corona Cases: కరోనా సెకండ్ వేవ్‌తో పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పది శాతంపైన పాజిటివ్‌ రేటుతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. దేశంలో ప్రాంతాలవారీగా కొవిడ్‌ వైరస్‌ పలు రకాలుగా వ్యాప్తిలో ఉన్నాయి. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒకో విధంగా వ్యాప్తిలో ఉంది.

ప్రస్తుతం కేసులు అధికంగా ఉన్న దిల్లీ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాల్లో యూకే రకం వైరస్‌ ఎక్కువగా ఉంది. కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో డబుల్‌ మ్యూటెంట్‌ రకం విస్తృతి కనిపిస్తోంది. పదిశాతం వరకు ట్రిపుల్‌ మ్యూటెంట్‌ కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పశ్చిమబెంగాల్‌లో 20 శాతం కేసుల్లో బి.1.618 వైరస్‌ కనిపిస్తోంది.

దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో ఎన్‌440కె రకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ డబుల్‌ మ్యూటెంట్‌ చాలా తక్కువగా ఉంది. యూకే రకం, డబుల్‌ మ్యూటెంట్‌, ఎన్‌440కె రకం వైరస్‌లు ఎక్కువ వ్యాప్తికి కారణమవుతున్నాయా? అంటే.. కేసులు పెరగడానికి ఇవి ఒక కారణమే తప్ప పూర్తిగా కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

పలు ప్రాంతాల్లో యూకే రకం, డబుల్‌ మ్యూటెంట్‌, ఎన్‌440కె రకం వైరస్‌లు బలంగా వ్యాప్తి చెందుతున్నాయి. సగానికంటే ఎక్కువ కేసుల్లో పాత సాధారణ వైరస్‌ రకాలే ఉన్నాయి. అయినా ప్రతిచోటా కేసులు పెరుగుతున్నాయి. కొత్త మ్యూటెంట్ల వ్యాప్తి ఒక్కటే కేసుల పెరుగుదలకు కారణం కాదు. కొత్తవి వచ్చినప్పుడు సహజంగానే కొత్త సమస్యలు వస్తాయి. వ్యాప్తి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధానమైన సమస్య. ఏరకం వైరస్‌ అనేది ప్రధానం కాదు వ్యాప్తి గొలుసు తెగితేనే కేసులు తగ్గుతాయి. మరోవైపు పాజిటివ్‌ కేసుల నమూనాల నుంచి వైరస్‌ జన్యుక్రమాన్ని ఆవిష్కరించడం ద్వారా కొత్త వైరస్‌ రకాల ఉనికిని గుర్తించడంతో పాటూ రోగ లక్షణాలు, మరణాల రేటు, వాటిపై ఏ మేరకు టీకా పనిచేస్తుంది అనే పరిశోధనలు కొనసాగించాలి. సీసీఎంబీ ఇదే చేస్తోంది. అదృష్టవశాత్తు టీకాలు కొత్తరకాల వైరస్‌లపైనే సమర్ధంగా పనిచేస్తున్నాయి. కేసుల పెరుగుదల చూస్తే ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాం. భవిష్యత్తు దృష్ట్యా వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి' అని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories