Central Minister Harshavardhan: మ‌రో రెండున్న నెలలు చాలా కీల‌కం: కేంద్ర మంత్రి

Central Minister Harshavardhan: మ‌రో రెండున్న నెలలు చాలా కీల‌కం:  కేంద్ర మంత్రి
x

 మ‌రో రెండున్న నెలలు చాలా కీల‌కం: కేంద్ర మంత్రి 

Highlights

Central Harsh Vardhan: క‌రోనా మ‌హమ్మారి దేశాన్నిఅత‌లాకుత‌లం చేసింది. ప్ర‌తి రంగంలో అనేక మంది జీవ‌నోపాది కోల్పోయారు. అనేక మంది.. క‌రోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

Central Harsh Vardhan: క‌రోనా మ‌హమ్మారి దేశాన్నిఅత‌లాకుత‌లం చేసింది. ప్ర‌తి రంగంలో అనేక మంది జీవ‌నోపాది కోల్పోయారు. అనేక మంది.. క‌రోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. త‌ర్వలోనే క‌రోనా వాక్సిన్ వ‌స్తుంది. అనుకునే స‌మ‌యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క‌రోనా పోరాటంలో మ‌రో రెండున్న‌ర నెల‌లు అత్యంత కీల‌క‌మ‌ని కేంద్ర మంత్రి అన్నారు. శుక్రవారం ఆయన దేశంలో కరోనా పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. శీతాకాలంతో పాటు పండుగల సీజన్ వల్ల వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు వ్యాక్సీన్లు ముందంజలో ఉన్నాయని అన్నారు. అందులో ఓ వాక్సిన్ తుది ద‌శ క్లినికల్ ట్రయల్స్ ఉండగా.. మరో రెండు స్టేజ్-2 దశలో ఉన్నాయని ఆయ‌న వివ‌రించారు. కరోనాను అంతం చేయడానికి త్వ‌ర‌లోనే వ్యాక్సీన్‌ అందుబాటులో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో ప్రతిపౌరుడూ మ‌రో రెండున్న‌ర నెల‌లు బాధ్యత యుతంగా ఉండాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌లు ధరించడం, బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పుకోవడం, చేతులను శుభ్రపరచడంతో పాటు భౌతికదూరం పాటించడం వంటి చర్యలకు మించిన వ్యాక్సిన్‌ లేదన్నారు. కరోనా రోగులకు చికిత్స అందించడంలో దేశం ఉత్త‌మైన సేవ‌లు అంద‌యాలి. . ప్రపంచ దేశాలతో పోలిస్తే .. భార‌త‌లో అత్యధిక రిక‌వ‌రీ రేటు ఎక్కువగా ఉంద‌న్నారు. మరణాల రేటు భారత్‌లోనే ఉందన్నారు. క్రియాశీల కేసులు రోజురోజుకీ తగ్గుతున్నాయని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించడం వైరస్ నిరోధక చర్యలన్నిటిలో కల్లా అత్యంత సమర్థవంతమైన చర్య అని ఆయన స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించడం వైరస్ నిరోధక చర్యలన్నిటిలో కల్లా అత్యంత సమర్థవంతమైన చర్య అని ఆయన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories