Coronavirus: దేశంలో తొలిసారి ల‌క్ష దాటిన క‌రోనా కేసుల సంఖ్య

Crossed the one lakh Corona Cases for the first time Time in India-05-04-2021
x

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Highlights

Coronavirus: గ‌త 24 గంటల్లో లక్షా, 3వేల, 558 మందికి కరోనా నిర్ధారణ

Coronavirus: భారత్‌లో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. దేశంలో క‌రోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. దేశంలో తొలిసారి క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష దాటింది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 17న‌ దేశంలో గ‌రిష్ఠంగా 97వేల 894 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డు దాటి గ‌త 24 గంటల్లో లక్షా, 3వేల, 558 మందికి కరోనా నిర్ధారణ అయింది.

వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నిన్న 52వేల 847 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి, 25లక్షల, 89వేల, 67కు చేరింది. గడిచిన 24 గంట‌ల సమయంలో 478 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య లక్షా, 65వేల, 101కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోటి,16 లక్షల, 82వేల, 136మంది కోలుకున్నారు. 7లక్షల, 41వేల, 830 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7కోట్ల, 91లక్షల, 5వేల, 163 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories