Bihar: బీహార్‌లో సామాన్యుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు

Crores of Money was Credited into Farmers Accounts
x

బీహార్ రైతు అకౌంట్లో కోట్ల రూపాయలు జమ (ఫైల్ ఇమేజ్)

Highlights

Bihar: రైతు అకౌంట్‌లోకి రూ.52 కోట్లు జమా

Bihar: బీహార్‌లో సామాన్యుల ఖాతాలు కోట్ల రూపాయలతో నిండిపోతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ, అకస్మాత్తుగా భారీ మొత్తంలో డబ్బు అకౌంట్‌లో వచ్చి పడుతుండడంతో ఖాతాదారులు ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత సొమ్ము తమది కాదని తెలిసి నిరుత్సాహానికి గురవుతున్నారు. కటిహార్ జిల్లా బగౌరా పంచాయతీకి చెందిన ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో మొన్న 960 కోట్లు జమకాగా తాజాగా ముజఫూర్‌ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రామ్ బహదూర్ షా రైతు. పింఛను ఖాతాకు ఆధార్ కార్డు, వేలిముద్ర వెరిఫికేషన్ కోసం బ్యాంకు వెళ్లిన ఆయన.. తన ఖాతాలో ఎంత ఉందో చెప్పాలని బ్యాంకు అధికారులను కోరాడు.

వృద్దుడి ఖాతాను చెక్ చేసిన అధికారులు తొలుత నోరెళ్లబెట్టగా, విషయం తెలిసి వృద్ధుడు షాకయ్యాడు. అతడి ఖాతాలో ఏకంగా 52 కోట్లు ఉండడమే అందుకు కారణం. అంతమొత్తం ఉందనగానే తనకు నోట మాట కూడా రాలేదని అన్నాడు. ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదన్నాడు. అయితే, మరీ అంత సొమ్ము వద్దు కానీ, ఎంతో కొంత ఇచ్చి తన జీవితాన్ని నిలబెట్టాలని బహదూర్ షా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

మరోవైపు, బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వచ్చి పడుతుండడంతో ఖాతాదారులు వాటిని డ్రా చేసుకోకుండా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, బీహార్‌కి చెందిన ఓ వ్యక్తి ఖాతాలో 5.5 లక్షలు పడగా బ్యాంకు అధికారులు బతిమాలినా వాటిని వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించాడు. ఆ డబ్బులు తనకు మోడీ వేశారని, వెనక్కి ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పడంతో బ్యాంకు అధికారులు విస్తుపోయారు.


Show Full Article
Print Article
Next Story
More Stories