Sitaram Yechury: సీపీఎం నేత సీతారాం ఏచూరికి అస్వస్థత..ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఐసీయూలో చేరిక

CPM General Secretary Sitaram Yechury is no more
x

 సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఇక లేరు

Highlights

Sitaram Yechury:సీపీఎం నేత సీతారాం ఏచూరి సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఢిల్లీలోని ఏయిమ్స్ కు తరలించారు. ఏచూరిని పరీక్షించిన వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Sitaram Yechury: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం తీవ్ర జ్వరంతో బాధపడుతూ మొదట ఢిల్లీ ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో చేరారు. శారీరక స్థితిని పరిశీలించిన తర్వాత, AIIMS వైద్యులు ఏచూరిని ICU (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) కు తరలించారు.

న్యుమోనియా కారణంగా అడ్మిట్:

72 ఏళ్ల సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ ఎయిమ్స్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, ఏచూరి న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరినట్లు సీపీఐ(ఎం) వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఏచూరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఏచూరికి ఇటీవలే క్యాటరాక్ట్ సర్జరీ కూడా జరిగింది.

ఏచూరి మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జీత్ కూటమి నిర్మాణ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అతను 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రామ్‌ను రూపొందించడంలో పి చిదంబరంతో కలిసి పనిచేశారు. 2004లో యూపీఏ ఏర్పాటు సమయంలో సంకీర్ణ ఏర్పాటు ప్రయత్నాల్లోనూ కీలక పాత్ర పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories