Sitaram Yechuri: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

CPM General Secretary Sitaram Yechury is no more
x

 సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఇక లేరు

Highlights

సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇక లేరు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. చాలా రోజుల పాటు చికిత్స పొందిన ఆయన గురువారం మరణించారు.

Sitaram Yechury is no more: ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందుతున్న ఏచూరి ఆరోగ్యం బాగా క్షిణించింది. 1992 నుంచి సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న ఏచూరి.. ఆర్థికవేత్త, కాలమిస్ట్ కూడా. ఆయన 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

ఏపీలోని కాకినాడ వాసి అయిన ఏచూరి ప్రజా ఉద్యమాలతో జనానికి దగ్గరయ్యారు. ఏపీ విభజన సమయంలో పార్లమెంట్‌లో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఆయన గళమెత్తారు. అలాగే తెలంగాణ హక్కుల గురించి పోరాడారు. పార్లమెంటరీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఏచూరి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పదునైన విమర్శలతో ఎక్కుపెట్టేవారు. కమ్యూనిస్టు ప్రముఖులు పి సుందరయ్య, ఈఎంఎస్, బీటీఆర్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బసవ పున్నయ్య, జ్యోతిబసు వంటి అగ్రనేతలతో సీతారాం ఏచూరి కలిసి పనిచేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories