ఇంట్లోనే కరోనా టెస్ట్..అందుబాటులోకి టెస్టింగ్ కిట్.. ధర రూ.250
CoviSelf: ఇకనుంచి కోవిడ టెస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు.
CoviSelf: ఇకనుంచి కోవిడ్ టెస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. కారణం, వచ్చే వారంలో కరోనా టెస్టింగ్ కిట్ అందుబాటులోకి రానుంది. ఈ కిట్ తో మీ ఇంట్లోనే కోవిడ్ టెస్టు చేసుకోవచ్చంట. టెస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశలో కేంద్రం అడుగులు వేసిన నేపథ్యంలో.. కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా టెస్టింగ్ కిట్ ను తక్కువ ధరలోనే మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ (RAT)ధరను రూ.250గా మాత్రమే. ఈ కిట్ తో కేవలం 15 నిమిషాల్లో కరోనా వైరస్ సోకిందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు.
పూణేకు చెందిన మై ల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ ఈ కిట్ ను రూపొందించింది. కరోనా లక్షణాలు ఉన్న వారు, కరోనా పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారు ఈ టెస్టింగ్ కిట్‌ను వినియోగించుకోవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. వారం రోజుల్లో ఈ కిట్స్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో టెస్టింగ్ కోసం బారులు తీరాల్సిన అవసరం లేకుండా.. హాయిగా ఇంట్లోనే పరిక్షించుకోవచ్చు.
𝐈𝐂𝐌𝐑 𝐢𝐬𝐬𝐮𝐞𝐝 𝐀𝐝𝐯𝐢𝐬𝐨𝐫𝐲 𝐟𝐨𝐫 𝐂𝐎𝐕𝐈𝐃-𝟏𝟗 𝐇𝐨𝐦𝐞 𝐓𝐞𝐬𝐭𝐢𝐧𝐠 𝐮𝐬𝐢𝐧𝐠 𝐑𝐚𝐩𝐢𝐝 𝐀𝐧𝐭𝐢𝐠𝐞𝐧 𝐓𝐞𝐬𝐭𝐬 (𝐑𝐀𝐓𝐬). For more details visit https://t.co/dI1pqvXAsZ @PMOIndia #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 pic.twitter.com/membV3hPbX
— ICMR (@ICMRDELHI) May 19, 2021
Today, Mylab has taken an important and essential step to help India and the world fight the worst pandemic in the history of mankind. A step that will empower every Indian to fight this pandemic. We feel humbled to give India - its first Self-use Covid-19 test kit - CoviSelf. pic.twitter.com/5Y9VxEIEEV
— Mylab Discovery Solutions (@MylabSolutions) May 20, 2021
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire