కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, అలాగే శానిటైజర్లు వాడాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, అలాగే శానిటైజర్లు వాడాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్ కు చెందిన ఓ సంస్థ వినూత్న మాస్క్ ను తయారు చేసింది. ఈ మాస్కులో ఉన్న స్పెషాలిటీ విషయానికొస్తే మాస్కును ధరించి బయటికి వెళ్లినపుడు బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా దగ్గినా, తుమ్మినా, కరోనా వైరస్ క్రిములు మాస్క్ పై పడితే చాలు వాటిని వెంటనే నిర్మూలించే విధంగా ఈ మాస్కును లివింగ్ గార్డ్ తయారు చేసింది. అంతే కాదు ఈ మాస్కు కరోనా వైరస్ ని మాత్రమే కాదు, వివిధ రకాల బ్యాక్టీరియాలను కూడా ఇది నాశనం చేస్తుంది. ఇక ఈ మాస్కు గురించి సంస్థ సీటీవో, భారత సంతతి శాస్త్రవేత్త సంజీవ్ స్వామి మాట్లాడుతూ ఈ మాస్క్ లో ప్రతి చదరపు సెంటీమీటర్ కూ 2,600 కోట్ల విద్యుదావేశాలు పుడతాయని ఆయన అన్నారు.
వైరస్ లు ఈ మాస్కును తాకగానే వైరస్ పై పొరలు పేలి, అవి చనిపోతాయని లేదా నిర్వీర్యం అవుతాయని వెల్లడించారు. అంతే కాదు ఈ మాస్క్ లను వాడిన తరువాత మళ్లీ వాటిని ఉతుక్కుని వాడుకోవచ్చని ఆయన వెల్లడించారు. విస్తృత పరీక్షల తరువాతనే వీటిని వినియోగించవచ్చని తేల్చినట్టు తెలిపారు. ఇది మానవ శరీరానికి ఎటువంటి హాని కలిగించదని నిర్ధారించారు. అమెరికా మిలిటరీ వర్గాలు, కొందరు డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు దీన్ని వాడుతున్నారని ఆయన తెలిపారు. ఇవి 99.9 శాతం వరకూ వైరస్ ను అడ్డుకుంటాయని తెలిపారు.
ఈ మాస్క్ లో భిన్నమైన వస్త్రాన్ని, రసాయనిక బంధాల పోగుల ద్వారా తయారు చేశామని ఆయన తెలిపారు. దీనిపై ప్రతిక్షణం 0.1 నుంచి 0.8 మిల్లీ ఓట్ల ధనాత్మక విద్యుదావేశం పుడుతూ ఉంటుందని, దాని ద్వారా వైరస్ క్రిములు నశిస్తాయని సంస్థ వెల్లడించింది. సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆర్ఏ మషేల్కర్ లతో కలసి తాజాగా ఓ వెబినార్ లో ఆయన పాల్గొన్నారు. తాము 1000కిపైగా రసాయనాలను పరిశీలించి, అందులో నుంచి 8 రసాయనాలను ఎంపిక చేసి, ప్రత్యేక పద్ధతుల్లో మాస్క్ ను తయారు చేశామని అన్నారు.
ఇక ఈ మాస్క్ ల ధర విషయానికి వస్తే..ఈ మాస్కుల ధర ఒక్కోదానికి రూ. 1,490 నుంచి రూ. 1,990 మధ్య ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మాస్కును సుమారుగా 7 నెలల పాటు వాడుకోవచ్చని లివింగ్ గార్డ్ చెబుతోంది. నవీ ముంబయిలోని ఓ ఫ్యాక్టరీలో ఇదే తరహా వస్త్రాన్ని తయారు చేస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. ఈ వస్త్రాన్ని వారంలో 1.5 లక్షల మాస్క్ లను తయారు చేసి, ఆపై ఉత్పత్తి సామర్థ్యాన్ని దశల వారీగా పెంచుతామని ఆయన తెలిపారు. ఇక ఈ మాస్క్ తో చేతి తొడుగులను తుడిస్తే, వాటిపై నిలిచివున్న వైరస్ కూడా నశిస్తుందని, ఇదే క్లాత్ తో త్వరలో బాడీ సూట్లను అభివృద్ధి చేయనున్నామని సంస్థ ప్రకటించింది. మరో వారంలో వీటి అమ్మకాలు ఆన్ లైన్ మాధ్యమంగా ప్రారంభమవుతాయని సంజీవ్ స్వామి వెల్లడించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire