Covid vaccine Covaxin update: కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పురోగతి
Covid vaccine Covaxin update: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి.
Covid vaccine Covaxin update: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. శాస్త్రవేత్తలు కూడా హర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రంలోగల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (పీజీఐ)లో నిర్వహించిన 'కొవాగ్జిన్' టీకా మొదటి దశ క్లినికల్‌ట్రయల్స్ విజయవంతంగా పూర్తైనట్లు ట్రయల్ టీం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సవితావర్మ వెల్లడించారు. ఫేస్ -1లో రెండో భాగం కింద శనివారం మొత్తం ఆరుగురికి టీకా వేసినట్లు ఆమె చెప్పారు.
'టీకా ట్రయల్ ఫేస్ -1లో మొదటి భాగం పూర్తయిందని సవితావర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా 50 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చామని, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు. సెకండ్ ఫేజ్ కింద ఆరుగురికి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు కొవాగ్జిన్ మొదటి దేశీయ టీకాగా భావిస్తున్నారు. జూలై 17న ఈ టీకా మొదటి హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ పీజీఐ రోహతక్‌లో ప్రారంభమయ్యాయి. ఆ రోజు ముగ్గురు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire