Covid Patients Provide wrong Information: యూపీలో క‌రోనా రోగుల గ‌ల్లంతు..

Covid Patients Provide wrong Information: యూపీలో క‌రోనా రోగుల గ‌ల్లంతు..
x
CORONA
Highlights

Covid Patients Provide wrong Information: దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తుంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉ. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి

Covid Patients Provide wrong Information: దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌రాళ నృత్యం చేస్తుంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉ. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైర‌స్ ఉధృతిని క‌ట్ట‌డి చేయ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కృషి చేస్తుంటే.. మ‌రోప‌క్క క‌రోనా రోగులు టెస్టుల స‌మ‌యంలో త‌ప్పుడు వివ‌రాలు ఇస్తూ.. ప్ర‌భుత్వానికి స‌వాల్ విసురుతున్నారు. ఇలాంటి వింత ప‌రిస్థితులు ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ల‌ఖ్‌న‌వులో చేటు చేసుకుంటున్నాయి.

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ల‌ఖ్‌న‌వులో జులై 23 నుంచి 31వ తేదీ మధ్యలో సుమారు 3 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 2,290 మంది కరోనా రోగుల ఆచూకీ లభించడం లేదని, టెస్టుల సమయంలో రోగులంతా తప్పుడు పేర్లు, చిరునామాలు, సెల్‌ ఫోన్‌ నంబర్లు ఇచ్చారు. రోగులకు టెస్టుల వివ‌రాలు తెలిపే స‌మ‌యంలో రోగులు స్పందించ‌క‌పోవ‌డంతో.. ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వెంటనే పోలీసుల‌కు ఫిర్యాదు చేయగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ 1,171 మంది రోగులను క‌నుగొన్నారు. మిగతావారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు సాగుతున్నారు. తప్పుడు వివరాలు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నార‌ని కమిషనర్‌ సుజిత్‌ పాండే ఆదివారం మీడియాకు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories