ఆక్స్‌ఫర్డ్ టీకా గురించి గుడ్ న్యూస్ చెప్పిన సీరమ్

ఆక్స్‌ఫర్డ్ టీకా గురించి గుడ్ న్యూస్ చెప్పిన సీరమ్
x
Highlights

కరోనాతో ప్రపంచం అంతా తలకిందులైంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ కోసం ప్రతీ ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. వాల్డ్ వైడ్‌గా ఎన్ని టీకాలు తయారవుతున్నా...

కరోనాతో ప్రపంచం అంతా తలకిందులైంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ కోసం ప్రతీ ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. వాల్డ్ వైడ్‌గా ఎన్ని టీకాలు తయారవుతున్నా అందరి దృష్టి మాత్రం ఆక్స్‌ఫర్డ్ టీకా మీదే ఉంది. ఆస్ట్రాజెనికా సంస్థతో కలిసి యూనివర్సిటీ సైంటిస్టులు తయారు చేసిన టీకా మంచి ఫలితాలను ఇస్తోంది. యువతతో పాటు వృద్ధుల్లోనూ ఇమ్యూనిటీ విషయంలో ఒకరకమైన ఫలితాలు కనిపిస్తున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. యాంటీబాడీలతో పాటు అవి క్రియేట్ చేసే టీసెల్స్ నంబర్ కూడా భారీగా ఉందని చెప్పారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ ఆశ మొదలైంది జనాల్లో ! కష్టాలకు ఎండ్ కార్డ్ పడే సమయం వచ్చిందని సంబరపడిపోతున్నారు.

భారత్‌లోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌ కోవీషీల్డ్ పేరుతో ఆక్స్‌ఫర్ట్ టీకాను అభివృద్ధి చేస్తోంది. ఇది డిసెంబర్‌ నాటికి రెడీ అవుతుందని ఆ సంస్థ చీఫ్‌ ఆదార్‌ పూనావాలా తెలిపారు. పది కోట్ల వ్యాక్సిన్‌ డోసులతో తొలి బ్యాచ్‌ వచ్చే ఏడాది రెండు లేదా మూడో త్రైమాసికంలో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. భారత్‌లో డిసెంబర్‌ నాటికి మానవ పరీక్షలు పూర్తవుతాయని, బ్రిటన్‌లో పరీక్షలు కూడా ముగిస్తే భారత్‌లో జనవరి నాటికి వ్యాక్సిన్‌ లాంఛ్‌ చేస్తామని చెప్పారు.

బ్రిటన్‌లో మరో రెండు వారాల్లో వ్యాక్సిన్‌ పరీక్షలు పూర్తై వ్యాక్సిన్‌ సామర్థ్యం, భద్రత మెరుగ్గా ఉందని తెలిస్తే అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తాము భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తామని పూనావాలా చెప్పారు. ఐతే ఇదంతా కొన్ని వారాల ప్రక్రియ అని దీనిపై తాను ఊహించి చెప్పలేనని, ఆరోగ్య శాఖ అధికారులే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories