Covid Vaccine: ఇళ్ల వద్దకే కొవిడ్ టీకా..ఎక్క‌డో తెలుసా?

Covid Vaccine Door Delivery
x

కరోనా టీకా 

Highlights

Covid Vaccine: కరోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది.

Covid Vaccine: కరోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది. ఈ మ‌హమ్మారి బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోజు వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డికి ఆయా రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. మ‌రోవైపు క‌రోనా అడ్డుక‌ట్ట వేసేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా కొన‌సాగుతుంది. అయితే దేశంలో బాధితులు ఎక్కువగా ఉండటం వ్యాక్సిన్ ఉత్ప‌త్తి తక్కువగా ఉండటం తో అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి.

ఇదిలా ఉంటే బ్రహ్మపుర నగరపాలక సంస్థ పరిధిలో వృద్ధులు, దివ్యాంగులు మంచానికే పరిమితమైన వారి ఇళ్ల వద్దకు వెళ్లి కొవిడ్ టీకాలు వేయాలన్న లక్ష్యంతో 'వ్యాక్సినేషన్ ఎట్ డోర్స్టెప్' పేరిట సంచార వాహనానికి సోమవారం ప్రారంభించారు.ఉదయం స్థానిక బీఈఎంసీ కార్యాలయం ఆవరణలో ఈ వాహనానికి బ్రహ్మపుర ఎమ్మెల్యే బిక్రం కుమార్ పండా పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంజాం కలెక్టరు విజయ అమృత కుళంగె కూడా పాల్గొన్నారు.

కరోనాపై ప్రజా చైతన్యానికి ఓ ద్విచక్ర వాహనానికి వైరస్ ఆకృతిని అమర్చి వినూత్నంగా తయారు చేశారు. ఈ వాహనాన్ని కూడా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ల నుంచి బయటకు రాలేని వారి ఇళ్లకు వెళ్లి టీకాలు వేసేలా ఏర్పాట్లు చేయాలని పలువురు నగరవాసులు కోరారని.. ఈమేరకు ఈ వాహన సేవలు ప్రారంభించామని తెలిపారు. ముందురోజు సంబంధిత టెలీఫోను నెంబరుకు ఫోను చేసి స్లాట్ బుక్ చేసుకున్న వారి ఇళ్లకు వాహనంలో సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్ వేస్తారని చెప్పారు. స్లాట్ల బుకింగ్ టీకాల లభ్యత ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టరు కుళంగె వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories