వెంటాడుతున్న కరోనా థర్డ్‌ వేవ్‌ భయం.. థర్డ్ వేవ్‌కు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్

COVID-19 Third Wave May Last for 98 Days: SBI Report
x

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )


Highlights

COVID-19 Third Wave: సెకండ్ వేవ్ తగ్గిందనుకుంటే ఇప్పుడు థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది.

COVID-19 Third Wave: సెకండ్ వేవ్ తగ్గిందనుకుంటే ఇప్పుడు థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. రెండో వేవ్ ఇంకా అయిపోక ముందే మూడో వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. థర్డ్ వేవ్‌కు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ రీసెర్చ్ డాక్యుమెంట్ వెలువరించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటుండటం వైద్య వసతులు మెరుగవుతుండటంతో థర్డ్ వేవ్ ప్రభావం తక్కువగానే ఉండొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. తీవ్రంగా కరోనా బారిన పడిన దేశాల్లో సెకండ్ వేవ్ 108 రోజులపాటు కొనసాగగా థర్డ్ వేవ్ 98 రోజులకే పరిమితమైందని తెలిపింది. అంతర్జాతీయ అనుభవాలను బట్టి థర్డ్ వేవ్ తీవ్రత సెకండ్ వేవ్ కంటే తక్కువగా ఉంటుందని ఎస్ఐబీ అంచనా వేసింది.

థర్డ్ వేవ్ కోసం మెరుగ్గా సన్నద్ధమైతే మరణాల సంఖ్య తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది. అధికారిక లెక్కల ప్రకారం మార్చి చివరి వరకు మన దేశంలో 1 లక్ష 62 వేల మంది కరోనా కారణంగా చనిపోయారు. ఆ తర్వాత రెండు నెలల్లోనే మరణాల సంఖ్య రెట్టింపయ్యింది. సెకండ్ వేవ్ కారణంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 3.35 లక్షలు దాటింది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆక్సిజన్ కొరత కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

గత కొద్ది వారాలుగా రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ కేవలం మన దేశ జనాభాలో 3.2 శాతం మంది మాత్రమే పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఎస్‌బీఐ రిపోర్టు ప్రకారం మెరుగైన వైద్య వసతులు, వ్యాక్సినేషన్‌ను పెంచడం ద్వారా థర్డ్ వేవ్ నుంచి బయటపడగలం. వ్యాక్సినేషన్ వల్ల ఆరోగ్య పరిస్థితి విషమించే కరోనా కేసులు 20 శాతం నుంచి థర్డ్ వేవ్‌లో ఐదు శాతానికి తగ్గించొచ్చు. ఫలితంగా కరోనా మరణాలను 40 వేలకు తగ్గించొచ్చని ఎస్‌బీఐ రిపోర్టు వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories