కోవిడ్ రోగిపై అంబులెన్స్ డ్రైవర్‌ అఘాయిత్యం

కోవిడ్ రోగిపై అంబులెన్స్ డ్రైవర్‌ అఘాయిత్యం
x
Highlights

కేరళలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ అంబులెన్స్ డ్రైవర్ కోవిడ్..

కేరళలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ అంబులెన్స్ డ్రైవర్ కోవిడ్ రోగి అయిన మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. సెంట్రల్ కేరళలోని పతనమిట్టిట్ట జిల్లాలో శనివారం రాత్రి కరోనావైరస్ రోగిపై అంబులెన్స్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నేరం జరిగిన గంటల్లోనే అంబులెన్స్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

శనివారం సాయంత్రం ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలకు కోవిడ్ -19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కేరళలో ప్రామాణిక కోవిడ్ -19 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపి) ప్రకారం, కోవిడ్ రోగులను అంబులెన్స్ ద్వారా మాత్రమే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. ఈ క్రమంలో వారిని తీసుకెళ్లేందుకు అర్ధరాత్రి సమయంలో అంబులెన్స్ వచ్చిందని, ఒక రోగిని స్థానిక, కోవిడ్ -19 ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఇతర రోగిని మరొక ఆసుపత్రికి తీసుకెళ్లాలని అధికారులు అంబులెన్స్ డ్రైవర్‌కు సూచించారు.

అయితే ఆ డ్రైవర్ సదరు మహిళను అంబులెన్స్‌ లో ఎక్కించుకొని నిర్జన ప్రదేశంలో ఆపి, ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్నీ ఎవరికైనా వెల్లడిస్తే ఆమె కూడా భయంకరమైన పరిణామాలకు గురవ్వాల్సి ఉంటుందని బెదిరించాడు. అయితే ఆసుపత్రిలో చేరిన తర్వాత ఈ సంఘటన గురించి ఆమె వైద్యులకు చెప్పారు. తరువాత, వైద్య పరీక్షలో లైంగిక వేధింపులు నిర్ధారించబడ్డాయి. నిందితుడు (29)పై గతంలో హత్యాయత్నంతో సహా పలు క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని తాత్కాలిక ప్రాతిపదికన నియమించినట్లు గుర్తించారు, ఆయనకు ఉద్యోగం ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories