Coronavirus Vaccine Updates: అనుకున్న టైమ్ కన్నా ముందుగానే కోవాగ్జిన్ టీకా

Coronavirus Vaccine Updates: అనుకున్న టైమ్ కన్నా ముందుగానే కోవాగ్జిన్ టీకా
x
Highlights

Coronavirus Vaccine Updates : కరోనా నిర్మూలనకు ఐసీఎంఆర్‌తో కలిసి భారత్‌ బయోటెక్‌ కంపెనీ రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ టీకా అనుకున్న సమయానికంటే ముందుగానే...

Coronavirus Vaccine Updates : కరోనా నిర్మూలనకు ఐసీఎంఆర్‌తో కలిసి భారత్‌ బయోటెక్‌ కంపెనీ రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ టీకా అనుకున్న సమయానికంటే ముందుగానే అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయ్. వచ్చే ఏడాది మార్చి తర్వాతే టీకా అందుబాటులోకి వస్తుందని తొలుత ఐసీఎంఆర్‌ అంచనా వేసినప్పటికీ అంతకంటే ముందుగా ఫిబ్రవరిలోనే విడుదలయ్యే చాన్స్ ఉందని ఐసీఎంఆర్‌ సైంటిస్ట్ తెలిపారు. ఇప్పటికే రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయ్.

వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తోందని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సైంటిస్ట్ రజనీకాంత్ అన్నారు. మూడో దశ ప్రయోగాలు కాకముందే వ్యాక్సిన్‌ అందజేస్తారా అన్న ప్రశ్నకు దీనిపై ఐసీఎంఆర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఫేజ్‌ 1, ఫేజ్ -2 ప్రయోగాల్లోనూ జంతువులపై జరిపిన ప్రయోగాల్లోనూ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేసిందని చెప్పారు. ఐతే మూడో దశ ఫలితాలు పూర్తి కాకుండా నూరు శాతం కచ్చితంగా పనిచేస్తుందని అప్పుడే చెప్పలేమని అన్నారు. అత్యవసర వినియోగంపై ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories