GSLV F14 Launch: రేపే జీఎస్ఎల్‌వీ ఎఫ్-14 ప్రయోగం.. కౌంట్‌డౌన్ ప్రారంభం

Countdown To Gslv F14 Rocket Launch
x

GSLV F14 Launch: రేపే జీఎస్ఎల్‌వీ ఎఫ్-14 ప్రయోగం.. కౌంట్‌డౌన్ ప్రారంభం

Highlights

GSLV F14 Launch: వాతావరణ విపత్తులు, భూమి, సముద్ర ఉపరితలంపై..పరిశోధనలు చేసి సమాచారం అందించనున్న INSAT 3DS

GSLV F14 Launch: వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌–3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ-F 14 ఉపగ్రహ వాహక నౌకను నేడు ఇస్రో ప్రయోగించనుంది. ఇందుకోసం శుక్రవారం మధ్యాహ్నమే కౌంట్‌డౌన్‌ మొదలైంది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌–3డీ, ఇన్‌శాట్‌–3డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్‌శాట్‌–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది.

సుమారు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్‌–3డీఎస్‌ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో శాటిలైట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజులపాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి మారుస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories