Coronavirus Vaccine Trails: వ్యాక్సిన్ ముందు వరుసలో ఎవరు?

Coronavirus Vaccine Trails: వ్యాక్సిన్ ముందు వరుసలో ఎవరు?
x
Highlights

Coronavirus Vaccine Trails: కరోనా వైరస్ ఒక పక్క వేగంగా విస్తరిస్తోంది... దీనికి అనుగుణంగా ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చినా దీనిని అందరికీ సకాలంలో వేయడం సాధ్యమయ్యే పనేనా?

Coronavirus Vaccine Trails: కరోనా వైరస్ ఒక పక్క వేగంగా విస్తరిస్తోంది... దీనికి అనుగుణంగా ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చినా దీనిని అందరికీ సకాలంలో వేయడం సాధ్యమయ్యే పనేనా? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది... అయితే భారత్ లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్లు క్లనికల్ ట్రయల్స్ లో్ ఉన్నా, మరో నెల, రెండు నెలల్లో ఇవి అందుబాటులోకి వచ్చినా, ముందు ఎవరికి వేయాలనే దానిపై మీ మాంస నెలకొంది. దీంతో్ పాటు అందరికీ వేయాలా? ఇలా వేస్తే ఎంత సమయం పడుతుంది? అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, వివిద దేశాల ప్రతినిధులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి చాలా మందికి వైరస్ సోకి హెర్డ్ ఇమ్యూనిటీ పెరడగం, రెండోది వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ రావడం. వ్యాక్సిన్‌ ప్రభావవంతమైనది అయినప్పటికీ హెర్డ్ ఇమ్యూనిటీ కూడా ఎంతో కొంత మేర సాయపడుతుంది.

ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా.. ప్రపంచంలో ఉన్న 8 బిలియన్ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడమన్నది ఆచరణీయంగానూ కష్టంతో కూడుకొన్న పనే. చిన్న చిన్న దేశాల్లో సైతం ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమన్నది సవాల్‌తో కూడుకొన్న పని. అలాంటిది అధిక జనాభా ఉన్న మన దేశంలో ఈ వ్యాక్సిన్‌ని అంతమందికి ఇచ్చేందుకు ఎక్కువ సమయం కూడా పట్టనుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ వస్తే మొదట దీన్ని ఎవరికి ఇస్తారన్నది ఇప్పుడు అందరిలో మెదలుతోంది. ప్రభుత్వం ముందు చెప్పినట్లుగా ఫ్రంట్‌ లైన్ వర్కర్‌లకే మొదట వ్యాక్సిన్‌ని ఇస్తే.. మిగిలిన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇక ఫార్మా కంపెనీలతో ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ ఎవరికి వెళ్తుందన్నది ఇప్పట్లో సమాధానం లేని ప్రశ్న.

ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు దేశాలను హెచ్చరించింది. 'వ్యాక్సిన్ జాతీయవాదం' అన్నది ఎంతమాత్రం మంచిది కాదని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. వ్యాక్సిన్ జాతీయవాదాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చీఫ్ టెడ్రోస్‌ అథనామ్‌ అన్నారు. వ్యాక్సిన్‌ని తయారు చేసిన ప్రతి దేశం, మిగిలిన దేశాలకు సాయం చేయాలని ఆయన వెల్లడించారు. మరి కరోనాకు పూర్తి స్థాయి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది..? వచ్చినా దాన్ని మొదట ఎవరికి అందివ్వనున్నారు..? దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందుతుందా..? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories