దేశ ప్రజలకు న్యూఇయర్ గిఫ్ట్‌గా కరోనా వ్యాక్సిన్..

దేశ ప్రజలకు న్యూఇయర్ గిఫ్ట్‌గా కరోనా వ్యాక్సిన్..
x
Highlights

రేపు నిపుణుల కమిటీ భేటీ.. టీకాకు ఆమోదం జనవరి 2 నుంచి దేశవ్యాప్తంగా డ్రై రన్ స్వదేశీ టీకానే అందుబాటులోకి తెస్తామన్న ప్రధాని

దేశ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ కింద వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది కేంద్రం. జనవరి రెండు నుంచి అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించనున్నారు. రేపు నిపుణుల కమిటీ భేటీ అయి అలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. ఇలా టీకా పంపిణీ స్టార్ట్ చేయనున్నారు. ఇక స్వదేశీ టీకానే అందుబాటులోకి తెస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

జీవితాలను తలకిందులు చేసింది మాయదారి కరోనా ! వేగంగా పరిగెత్తుతున్న జీవితాలను స్పీడ్ బ్రేకులేసి అడ్డుకున్నట్లైంది ప్రతీ ఒక్కరి పరిస్థితి ! మహమ్మారి కారణంగా చాలా జీవితాలు అలసిపోయాయ్. నిరాశనిస్పృహల్లోకి జారుకున్నాయ్. వ్యాక్సిన్ ఎప్పుడా అని ఆర్తిగా ఎదురుచూస్తున్నాయ్. ఇలాంటి సమయంలో కేంద్రం గుడ్న్యూ స్ చెప్పింది. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా టీకా ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా జ‌న‌వ‌రి 2 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రై ర‌న్ నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.

వ్యాక్సిన్ పంపిణీలో సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా డ్రైరన్ నిర్వహించనున్నారు. టీకా రిహార్సల్ కార్యక్రమంగా తెలిపే ఈ డ్రై రన్‌ను ఇప్పటికే ఏపీతో పాటు పంజాబ్‌, అసోం, గుజరాత్‌ రాష్ట్రాల్లో 28, 29 తేదీల్లో నిర్వహించారు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో జనవరి రెండు నుంచి డ్రైరన్ నిర్వహించనున్నారు. ఇక టీకాకు సంబంధించి శుక్రవారం భేటీ కానున్న నిపుణుల కమిటీ.. ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయ్. గ్రీన్‌సిగ్నల్ రాగానే.. పంపిణీ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది.

వ్యాక్సిన్ పంపిణీ అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి స‌మావేశం నిర్వహించారు. రాష్ట్రాల రాజ‌ధానుల్లో క‌నీసం మూడు ప్రాంతాల్లో ఈ డ్రైన్ని ర్వహించాలని కేంద్రం సూచించింది. కొన్ని జిల్లా కేంద్రాల్లోనూ ట్రయల్స్ జరపాలని ఆదేశించింది. వ్యాక్సినేష‌న్ ల‌క్ష్యాల‌ను అందుకునేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాల‌ని కేంద్రం ఆదేశాల్లో తెలిపింది. ఇక అటు వ్యాక్సినేష‌న్ కోసం కేంద్ర ప్రభుత్వం 83కోట్ల సిరంజీల‌కు ఆర్డర్ చేసింది. అద‌నంగా మ‌రో 35కోట్ల సిరంజీల కోసం బిడ్స్ దాఖ‌లు చేసింది.

స్వదేశీ టీకాను అందుబాటులోకి తెస్తామని ప్రధాని మోడీ అన్నారు. టీకా తీసుకున్న తర్వాత కూడా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని... మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరి అని సూచించారు. గుజరాత్‌ రాజ్‌కోట్‌లో ఏర్పాటుచేయనున్న ఎయిమ్స్‌కు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేసిన ఆయన... అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని తెలిపారు.


దేశవ్యాప్తంగా ఎనిమిది వ్యాక్సిన్ వివిధ రకాల దశల్లో ఉన్నాయ్. ఐతే అందులో భారత్ బయోటెక్ సంస్థ టీకా మీదే అందరి ఆశలు ఉన్నాయ్. ఇక అటు ఆక్స్ఫ ర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్‌ను సీరమ్ సంస్థ కోవీషీల్డ్ పేరుతో డెవలప్ చేసింది. ఇప్పటికే దీనికి యూకేలో అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. జైడస్ క్యాడులాతో పాటు... రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ట్రయల్స్ కూడా ఇండియాలో కొనసాగుతున్నాయ్. ఐతే ఇందులో ఏ టీకాకు అనుమతి ఇవ్వబోతున్నారన్ది ఆసక్తికరంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories