Coronavirus Vaccine Clinical Trails: మరింత వేగవంతంగా వ్యాక్సిన్లు.. మొదటి దశ పూర్తిచేసుకున్న మూడు వ్యాక్సిన్లు

Coronavirus Vaccine Clinical Trails: మరింత వేగవంతంగా వ్యాక్సిన్లు.. మొదటి దశ పూర్తిచేసుకున్న మూడు వ్యాక్సిన్లు
x
Covid Vaccine Trails
Highlights

Coronavirus Vaccine Clinical Trails: ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురు చూస్తున్న ప్రపంచానికి భారత దేశం తీపి కబురు అందించింది.

Coronavirus Vaccine Clinical Trails: ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురు చూస్తున్న ప్రపంచానికి భారత దేశం తీపి కబురు అందించింది. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమయ్యే వ్యాక్సిన్ తయారీలో దేశం ముందంజలో ఉంది. దీనికి సంబంధించి మూడు వ్యాక్సిన్లు తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకుని, రెండో దశలో అడుగు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత తొందర్లో ఈ వ్యాక్సిన్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు.. దేశంలో మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్ (ICMR) మంగళవారం నాడు తెలిపింది. మూడు కూడా భారత్‌కు చెందిన వ్యాక్సిన్లేనని.. ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయని ICMR డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. ముఖ్యంగా భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్‌ తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకుందని.. దానికి తోడుగా.. జైడస్ కాడిలాకు చెందిన డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ కూడా ఫస్ట్‌ ఫేస్‌ క్లినికల్ ట్రయల్స్‌ పూర్తిచేసుకున్నాయన్నారు.

ఇక ఈ రెండు వ్యాక్సిన్లకు రెండో ఫేస్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇక మూడవ వ్యాక్సిన్‌ ఆక్స్‌ఫోర్డ్‌ వ్యాక్సిన్‌ అని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారు చేస్తోందని.. అయితే ఈ వ్యాక్సిన్‌కు ఫస్ట్ ఫేస్ పూర్తవ్వడంతో పాటుగా.. సెకండ్‌,థర్డ్‌ (ఫైనల్‌) ఫేస్‌ క్లినికల్ ట్రయిల్స్‌కు పర్మిషన్స్‌ లభించాయన్నారు. వారం రోజుల్లో 17 17 ప్రాంతాల్లో ట్రయిల్స్ ప్రారంభమవుతాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories