ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో పెరిగిన పాజిటివ్ కేసులు

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో పెరిగిన పాజిటివ్ కేసులు
x
Representational Image
Highlights

మధ్యప్రదేశ్ లో గత 24 గంటల్లో 192 కొత్త కరోనా సంక్రమణ కేసులు నమోదు అయ్యాయి. దీనితో, రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 7645 కు చేరుకుంది. తాజాగా 13 మంది...

మధ్యప్రదేశ్ లో గత 24 గంటల్లో 192 కొత్త కరోనా సంక్రమణ కేసులు నమోదు అయ్యాయి. దీనితో, రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 7645 కు చేరుకుంది. తాజాగా 13 మంది రోగులు మరణించారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 334 మంది ప్రాణాలు కోల్పోయారు. సాగర్ జిల్లా కొత్త హాట్ స్పాట్ గా మారింది. గత 24 గంటల్లో ఇక్కడ 24 కేసులు కనుగొనబడ్డాయి. ఇప్పుడు నగరంలో వ్యాధి సోకిన వారి సంఖ్య 165 కి పెరిగింది.

అలాగే ఉత్తరప్రదేశ్ లో కూడా గత 24 గంటల్లో 275 కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కాన్పూర్ నగరంలో గరిష్టంగా 26 మంది రోగులు ఉన్నారు. లక్నో, నోయిడా, అంబేద్కర్ నగర్, ఉన్నవో , మధురాలలో ఒక్కో వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడు సోకిన వారి సంఖ్య 7445 కు చేరుకుంది. వీరిలో 2012 వలస కార్మికులు ఉన్నారు. మొత్తం మరణాల సంఖ్య 202 గా ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories