తెలుగు రాష్ట్రాలతో కలిపి 960 కోవిడ్ ఐసోలేషన్ కోచ్‌లు.. ఎన్ని బెడ్లంటే..

తెలుగు రాష్ట్రాలతో కలిపి 960 కోవిడ్ ఐసోలేషన్ కోచ్‌లు.. ఎన్ని బెడ్లంటే..
x
Highlights

దేశంలో కరోనా రోగుల సంఖ్య 3 లక్షల 55 వేల 642 కు పెరిగింది. మరణాల సంఖ్య కూడా 12 వేలకు చేరింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా 960 కోవిడ్ ఐసోలేషన్ కోచ్‌లను...

దేశంలో కరోనా రోగుల సంఖ్య 3 లక్షల 55 వేల 642 కు పెరిగింది. మరణాల సంఖ్య కూడా 12 వేలకు చేరింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా 960 కోవిడ్ ఐసోలేషన్ కోచ్‌లను సిద్ధం చేసినట్టు రైల్వే బుధవారం తెలిపింది. ఇవి ఢిల్లీలో 503, ఉత్తర ప్రదేశ్‌లో 372, తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 60, మధ్యప్రదేశ్‌లో 5 ఉన్నాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన 503 ఐసోలేషన్ కోచ్‌లు.. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో 267, షకుర్ బస్తీ, సారాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్ వద్ద 267 ఐసోలేషన్ బోగీలు ఏర్పాటు చేశారు.

ఈ ఐసోలేషన్ కోచ్‌లతో, కరోనా రోగుల చికిత్స కోసం 8 వేల పడకలను అందిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల జీతాలు చెల్లించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది . వైద్యుల జీతాల చెల్లింపుపై నాలుగు వారాల్లోగా కేంద్రం నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories