మరెన్నో ఉపద్రవాలు తలెత్తవచ్చు జాగ్రత్త పడాల్సిందే : డబ్ల్యూహెచ్ఓ చీఫ్

who chief warned nations
x

WHO chief (file photo)

Highlights

ప్రపంచ దేశాల ప్రభుత్వాలు కరోనా లాంటి వైద్యారోగ్య విపత్తులు తలెత్తినపుడు డబ్బులు ఖర్చు పెట్టి చేతులు దులుపుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ అన్నారు.

ప్రపంచ దేశాల ప్రభుత్వాలు కరోనా లాంటి వైద్యారోగ్య విపత్తులు తలెత్తినపుడు డబ్బులు ఖర్చు పెట్టి చేతులు దులుపుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. ప్రపంచాన్ని ప్రస్తుతం కుదిపేస్తున్న కరోనా వైరస్ నివారించినంత మాత్రాన బయటపడిపోతామని భావించొద్దని అయన చెప్పారు. ఇది చివరిది కాదనీ..ఇటువంటివి వారెన్నో ప్రపంచం చూడబోతోందనీ ఆయన హెచ్చరించారు. సరైన పశు సంరక్షణ నిర్వహణ లేకపోవడం..వాతావరణ మార్పులు వంటివి ఆరోగ్యం మెరుగు పడటం కోసం చేసే ప్రయత్నాలను వుందా ప్రయాసలుగా మారుస్తున్నాయని ఆయన అన్నారు. అంటువ్యాధుల సన్నద్ధత అంతర్జాతీయ దినోత్సవాన్ని తొలిసారిగా ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి అయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియో సందేశంలో ఈ విధంగా అయన వ్యాఖ్యానించారు.

కోవిద్ నుంచి ప్రపంచం నేర్చుకోవలసింది చాలా వుంది. అంటూ వ్యాధులు వ్యాపించినపుడు భయాందోళనలకు గురి కావడం.. వెంటనే వాటి నివారణపై హడావుడిగా డబ్బులు ఖర్చు చేయడం..తరువాత వాటిని మర్చిపోవడం ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలకు అలవాటుగా మారిపోయింది అని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. అంటువ్యాధుల విషయంలో దూరదృష్టి చాలా ముఖాయమన్న ఆయన అది లోపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కరోనా లాంటి ఉపద్రవాలు ప్రక్రుతి, జంతువులూ, మానవుల మధయ్ ఉండే సున్నితమైన అంశాల్ని గుర్తు చేస్తాయని ఆయన చెప్పారు. పర్యావరణంతో మానవునికి ఉండే ఈ బంధం దెబ్బ తినే కొలదీ ఇటువంటి ఉపద్రవాలు విరుచుకు పడుతూనే ఉంటాయని చెప్పారు.

కరోనా ప్రభావం మానవుల ఆరోగ్యం పైనే ప్రభావం చూపించలేదనీ.. దీంతో యావత్తు ప్రపంచం తల్లకిందులైందని అన్నారు. ఆరోగ్య రంగం తో పాటు.. సామాజిక, ఆర్ధిక రంగాలు కూడా తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కున్నాయని తెడ్రోస్ చెప్పారు. ఇకమీదటైనా ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలని అయన కోరారు. భవిష్య్తతులో ఇటువంటి మహమ్మారులు మరిన్ని ప్రబలకుండా చర్యలు చెప్పట్టాల్సి ఉంటుందని అయన అభిప్రాయ పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories