Coronavirus: దేశంలో థర్డ్ వేవ్ ఆ నెలలోనే-నీతిఅయోగ్

Coronavirus Third Wave Threat in September and  October Months
x

Representational Image

Highlights

Coronavirus: మూడో ద‌శ నాటికి దేశంలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Coronavirus: క‌రోనా రెండో ద‌శ ఏవిధంగా క‌ల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఏ ఆస్ప‌త్రి చూసిన ఈ మ‌హమ్మారి ఆర్తనాధ‌లు వినిపిస్తున్నాయి. ఈ మ‌హమ్మ‌రి నిత్యం 4 లక్షల కేసులతో జనాన్ని తీవ్రంగా వణికించింది. అయితే కేసులు తగ్గుతున్నా జనాల్లో భయం మాత్రం అలాగే ఉంది. థర్డ్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తుండడమే ఇందుకు కారణం. పలువురు వైద్య నిపుణులు థర్డ్ వేవ్ గురించి చాలా రోజులుగా హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే.

కేంద్రం కూడా రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. దీంతో.. ప్రజలు అలసత్వం వహించొద్దని కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అందరూ పాటించాలనే సూచనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ ను నిరోధించేందుకు చాలా కృషి చేసినట్టు చెప్పారు. కరోనా మూడో దశ ఎప్పుడు రావొచ్చన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో మొదలు కావొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు.

మూడో ద‌శ నాటికి దేశంలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలు యువకులపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని వ్యాక్సినేషన్ ద్వారా మాత్రమే ఈ మహమ్మారిని అడ్డుకునే అవకాశం ఉందని చెప్పారు.అయితే దేశంలో వ్యాక్సినేష్ ప్రక్రియ మాత్రం న‌త్త‌న‌డ‌క సాగుతుంది. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొర‌త వేధిస్తుంది.మొద‌టి డోస్ వేసిన వారికి రెండో డోస్ వేయ‌డానికి 60 రోజులు స‌మ‌యం తీసుకుంటున్నా... 80 కోట్ల‌మందికి క‌నీసం వ్యాక్సిన్ వేయాలంటే మ‌రో ఆరు నెల‌లుపైగా పట్టే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories