Coronavirus Test Report: ఇక 30 సెకన్లలో కరోనా ఫలితం.. భారత్ - ఇజ్రాయల్ కృషి

Coronavirus Test Report: ఇక 30 సెకన్లలో కరోనా ఫలితం.. భారత్ - ఇజ్రాయల్ కృషి
x
Coronavirus Tests
Highlights

Coronavirus Test Report: ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. నిత్యం పరీక్షలు చేస్తున్నా దానికి సంబంధించిన ఫలితం వెల్లడయ్యేందుకు రోజులు పడుతోంది.

Coronavirus Test Report: ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. నిత్యం పరీక్షలు చేస్తున్నా దానికి సంబంధించిన ఫలితం వెల్లడయ్యేందుకు రోజులు పడుతోంది. దీనివల్ల కొన్ని సమయాల్లో పాజిటివ్ ఉన్న వ్యక్తులు సరిగ్గా వ్యవహరించపోవడం వల్ల ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందుతోంది. దీనిని గుర్తించిన భారత్ - ఇజ్రాయల్ దేశాలు తక్కువ సమయంలో ఫలితం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో తక్కువ సమయంలోనే ఈ ఫలితం రోగులకు అందించనుంది.

అవును… 30 సెక‌న్ల‌లోనే క‌రోనా టెస్ట్ రిజ‌ల్ట్ ఇచ్చే అత్యాధునిక సాంకేతిక‌ను ఇజ్రాయిల్-భార‌త్ సంయుక్తంగా రూపోందిస్తున్నాయి. ఇందుకోసం ఇజ్రాయిల్ డిఫెన్స్ ఆర్&డీ టీం ప్ర‌త్యేక విమానంలో ఇండియా రాబోతుంది. ఇజ్రాయిల్ నుండి రాబోతున్న వైద్య శాస్త్ర‌వేత్త‌ల బృందం భార‌త చీఫ్ సైంటిస్ట్ విజ‌య్ రాఘ‌వ‌న్ బృందంతో క‌లిసి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌బోతుంది. ఇజ్రాయిల్ నుండి రాబోతున్న వైద్య బృందంతో పాటు ఇజ్రాయిల్ ప్ర‌భుత్వం ఇండియాకు మెకానిక‌ల్ వెంటిలేట‌ర్స్ ను కూడా పంపిస్తుంద‌ని ఇజ్రాయిల్ ప్ర‌క‌టించింది. క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో ఇజ్రాయిల్ ప్ర‌ధాని నేత‌న్యాహు, భార‌త ప్ర‌ధాని మోడీ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు ఫోన్లో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, క‌రోనాపై పోరాటంలో ఇరు దేశాలు స‌హ‌క‌రించుకోవాల‌న్న అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఇజ్రాయిల్ టెక్నాల‌జిని భార‌త్ లో ఉన్న భారీ త‌యారీ రంగాన్ని భాగ‌స్వామ్యం చేస్తే… వైర‌స్ ను క‌ట్ట‌డి చేసి, మ‌ళ్లీ యధాత‌థ జీవితం గ‌డిపేందుకు ఆస్కారం ఉంటుంద‌ని ఇజ్రాయిల్ ప్ర‌క‌టించింది. ఇజ్రాయిల్ ప్ర‌భుత్వం నుండి అన్ని అనుమ‌తులు రావ‌టంతో… భార‌త్ తో ద్వైపాక్షిక ప్ర‌యోగాల‌కు ఆస్కారం ఏర్ప‌డింద‌ని, భ‌విష్య‌త్ లో వైర‌స్ నుండి ఈ రెండు దేశాల‌నే కాకుండా ఇత‌ర దేశాల‌ను విముక్తి చేసేందుకు రెండు దేశాల ఉమ్మ‌డి కృషి ఫ‌లిస్తుంద‌ని ఇజ్రాయిల్ ప్ర‌భుత్వం అభిప్రాయ‌ప‌డింది.

క‌రోనా వైరస్ ఇజ్రాయిల్ లో ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలో భార‌త్ ఆ దేశానికి పీపీఈ కిట్స్, మాస్కుల‌తో పాటు ప‌లు ఔష‌ధాల‌ను స‌ర‌ఫ‌రా చేసి ఆదుకుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ ప్ర‌భుత్వం నుండి భార‌త్ కు కావాల్సిన స‌హాయం అందించేందుకు త‌ము సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇజ్రాయిల్ లో కేవ‌లం 56,748కేసులు మాత్ర‌మే రాగా… 23,560మంది కోలుకున్నారు. 433మంది మ‌ర‌ణించారు. ఇక ఇజ్రాయిల్ కూడా తాము క‌రోనాకు వ్యాక్సిన్ రెడీ చేశామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories