నాగ్‌పూర్‌ నుంచి తమిళనాడు ప్రయాణం.. హైదరాబాద్‌లో వలస కార్మికుడు మృతి

నాగ్‌పూర్‌ నుంచి తమిళనాడు ప్రయాణం.. హైదరాబాద్‌లో వలస కార్మికుడు మృతి
x
Highlights

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో కాలినడకన కొందరు వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో కాలినడకన కొందరు వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అలా ప్రయత్నించినా వారిలో కొందరు మృత్యువాత పడిన వారు కూడా ఉన్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ యువకుడు మహారాష్ట్రలోని నాగపూర్‌ నుంచి కాలిబాటన బయలుదేరి హైదరాబాద్‌లో మృతి చెందాడు. తమిళనాడులోని నమక్కల్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల లోగేష్ బాలసుబ్రమణి పొట్టకూటికోసం నాగపూర్ కు వెళ్ళాడు. అక్కడ కూలి పని చేసుకుంటున్నాడు.

అయితే లాక్ డౌన్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ నిలిచిపోవడంతో నాగ్పూర్ నుండి 500 కిలోమీటర్ల నడిచి బుధవారం రాత్రి సికింద్రాబాద్ లోని ఒక ఆశ్రయం గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అతను అక్కడే కుప్పకూలాడు. దాంతో లోగేష్‌ పరిస్థితిని గమనించిన స్థానికులు అధికారులకు సమచారం ఇవ్వడంతో ఓ షెల్టర్‌ హోంకు తరలించారు.

ఈ క్రమంలోనే గరువారం రాత్రి చికిత్స పొందుతూ అతను కన్నుమూశాడు. కాగా లోగేష్ తోపాటు 176 మంది, వలస వచ్చిన వారందరూ గత నాలుగు రోజులుగా సికింద్రాబాద్ బస చేస్తున్నారు, ప్రతిరోజూ వారి సంఖ్య పెరుగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories